Baby Movie: వామ్మో.. వైష్ణవి చైతన్య బేబీ సినిమా కలెక్షన్లు ఏకంగా అన్ని రూ.కోట్లా?

Baby Movie: ఆనంద్ దేవరకొండ వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బేబీ. ఈ సినిమా ప్రీమియర్ షో లో నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో విడుదలైనటువంటి ఈ సినిమా ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుని థియేటర్లకు ప్రేక్షకులను రప్పిస్తుంది.ఇలా మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నటువంటి ఈ సినిమా కమర్షియల్ గా కూడా మంచి సక్సెస్ అందుకుంది.

ఇలా ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను రాబడుతూ ఆనంద్ దేవరకొండ కెరియర్ లో మొదటి బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా మొదటి రోజు భారీ స్థాయిలో కలెక్షన్లను కూడా రాబట్టింది. ఈ విధంగా ఈ సినిమా మొదటి రోజు ఏ ఏ ప్రాంతాలలో ఎంత మొత్తంలో కలెక్షన్లను రాబట్టింది అనే విషయానికి వస్తే.. నైజాం ఏరియాలో ఈ సినిమా మొదటి రోజు2,37,79,786 రూపాయల కలెక్షన్స్ రాబట్టింది.

 

వైజాగ్,80,08,612, ఈస్ట్ 40,61, 593, వెస్ట్ 21,64,380, కృష్ణ 3461 956, గుంటూరు29,33,005, నెల్లూరు 1783404, సీడెడ్54,72,086, కర్ణాటక 20,32,312, ఓవర్సీస్ 1,74,00000 రూపాయల కలెక్షన్లను సాధించింది. ఈ సినిమా అన్ని ప్రాంతాలలో కలిపి మొదటి రోజు ఏకంగా 7,10, 97,034 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించి రికార్డు సృష్టించింది.ఇలా మొదటి రోజు ఈ స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది అంటే వీకెండ్ కావడంతో ఈ రెండు రోజులలో కూడా మరింత కలెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -