Mahesh Babu: వామ్మో.. చంద్రముఖి తరహా పాత్రలో మహేష్ కనిపిస్తారా?

Mahesh Babu: మహేష్ బాబు, ఈ పేరుకి టాలీవుడ్ లో ఎటువంటి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. టాలీవుడ్ ప్రిన్స్ గా తన సినీ కెరియర్ను మొదలు పెట్టిన మహేష్ బాబు ఇప్పుడు సూపర్ స్టార్ రేంజ్ కి ఎదిగాడు. అతను చేసిన ప్రతి చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం అని చెప్పవచ్చు.

 

కృష్ణ వారసుడిగా ,చైల్డ్ ఆర్టిస్ట్ గా మహేష్ బాబు సినీ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేశారు. చిన్నప్పటి నుంచే వైవిధ్యమైన పాత్రలు చేస్తూ తన నటనతో అభిమానులను ఆకట్టుకున్నాడు. ఇప్పటివరకు అతను చేసిన ప్రతి క్యారెక్టర్ ఒక ఎత్తు అయితే , ఇప్పుడు తాజాగా త్రివిక్రమ్ కాంబినేషన్ లో మహేష్ బాబు చేయబోతున్న సినిమా లో అతని క్యారెక్టర్ మరొక ఎత్తు అని సమాచారం.

 

గతంలో మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో అతడు మరియు ఖలేజా సినిమాలు వచ్చాయి. అతడు సినిమా తర్వాత మహేష్ బాబు స్టార్ ఇమేజ్ విపరీతంగా పెరిగింది. కలేజా తరువాత త్రివిక్రమ్ కు డైరెక్టర్ గా మంచి క్రేజ్ వచ్చింది. కానీ ఆ తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఇంతవరకు నెక్స్ట్ మూవీ ఏది రాలేదు. దీంతో ఇప్పుడు ఇద్దరి కాంబినేషన్లో మూవీ వస్తుంది అన్నడంతో ఫాన్స్ చాలా ఆసక్తిగా ఉన్నారు.

 

మహేష్ బాబు విదేశీ టుర్ మరియు అతని తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మరణం వల్ల షూటింగ్ కాస్త లేట్ అయినప్పటికీ ప్రస్తుతం అది ఎట్టకేలకు పట్టాల పైకి వచ్చింది. ఈ క్రమంలో మూవీ స్టోరీ లీక్ అయ్యింది అంటూ చాలా వార్తలు వచ్చాయి. ఇదే తరహాలో ప్రస్తుతం ఈ మూవీ స్టోరీ కు సంబంధించి మరో లేటెస్ట్ అప్డేట్ నెట్ లో హల్ చల్ చేస్తుంది. మహేష్ త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న ఈ మూవీ లో హీరోయిన్ క్యారెక్టర్ కి దెయ్యాన్ని వదిలించే పాత్రలో మహేష్ కనిపిస్తారని సమాచారం. అంతేకాదు ఈ క్రమంలో కొంత సమయం పాటు మహేష్ కు కూడా దెయ్యం పడుతుందని తెలుస్తోంది. ఇప్పటివరకు మహేష్ బాబుని ఓ పోలీస్ ఆఫీసర్ గా ,లవర్ బాయ్ గా ,రైతుగా , పొలిటీషియన్ గా ,మరియు బిజినెస్ మాన్ గా చూసిన ప్రేక్షకులు అతనిలో ఈ యాంగిల్ ని ఎలా రిసీవ్ చేసుకుంటారో వేచి చూడాలి.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -