Yatra 2: యాత్ర2 రివ్యూ.. జగన్ బయోపిక్ చూసి జనాలు నవ్వుతున్నారుగా!

Yatra 2: ఏపీ సీఎం జగన్ బయోపిక్ గా మహి వి రాఘవ్ డైరెక్షన్ లో తెరకెక్కిన యాత్ర2 మూవీ నేడు థియేటర్లలో విడుదలైంది. యాత్ర సినిమా రేంజ్ లో యాత్ర2 ఉంటుందని భావించిన జనాలు ఈ సినిమాలోని సీన్లను చూసి నవ్వుకుంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఈ సినిమా గురించి ఆహా ఓహో అని చెబుతున్నా సినిమాలో ప్రేక్షకులను మెప్పించే సన్నివేశాలు అస్సలు లేవనే చెప్పవచ్చు.

కథ

వైఎస్సార్ రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈ కథ మొదలు కాగా గెలిచిన కొన్ని నెలలకే ఆయన ప్రమాదంలో మరణించడంతో జగన్ ఓదార్పు యాత్ర దిశగా అడుగులు వేస్తాడు. అయితే ఓదార్పు యాత్రకు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రోగ్రెస్ పార్టీ(కాంగ్రెస్ పార్టీ) అనుమతులు ఇవ్వకపోవడంతో జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో కొత్త పార్టీని పెడతాడు.

2014 సంవత్సరంలో జగన్ ఓటమికి కారణాలేంటి? చంద్రబాబు ఇచ్చిన రైతు రుణమాఫీ హామీ జగన్ కు ఎలా నష్టం కలిగించింది? 2019లో వైసీపీ ఎలా అధికారంలోకి వచ్చింది అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.

విశ్లేషణ :

జగన్ బయోపిక్ కథగా చెప్పుకోవడానికి బాగానే ఉన్నా నిజ జీవితంలో జగన్ వైఖరి తెలిసిన వాళ్లకు చాలా సీన్లు నవ్వు తెప్పిస్తున్నాయి. రికార్డ్ స్థాయి థియేటర్లలో యాత్ర2 విడుదలైనా ఏ థియేటర్ లో కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఆక్యుపెన్సీ లేదు. జగన్ దండం పెట్టడు.. తల వంచడు అని ఇతర పాత్రలు చెప్పే డైలాగ్స్ అతిగా ఉన్నాయి. సినిమాలో జగన్ పాత్ర పదేపదే ఢిల్లీ పెద్దల ముందు వంగి వంగి దండాలు పెట్టడం వైసీపీ అభిమానులకు షాకిచ్చేలా ఉంది.

2024 ఎన్నికల్లో వైసీపీకి ఆశించిన స్థాయిలో ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో జగన్ ఒక భజన సినిమాను తీయించుకుని తన పరువు తానే పోగొట్టుకున్నాడని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. యాత్ర2 ఒక్కరోజు సినిమానే అని ఈ సినిమా కలెక్షన్లు లక్షల్లోనే ఉంటాయని బుకింగ్స్ ను బట్టి అర్థమవుతోంది. సినిమాలో పొంతన లేని సీన్లు ఎన్నో ఉన్నాయి.

టెక్నాలజీ ఎంతో పెరిగిన ఇలాంటి రోజుల్లో ఏ మాత్రం మెప్పించలేని ఇలాంటి బయోపిక్స్ వల్ల ఉపయోగం ఏంటని కామెంట్లు వినిపిస్తున్నాయి. జగన్ వీరాభిమానులను మినహా ఎవరినీ ఈ సినిమా మెప్పించే అవకాశాలు అయితే కనిపించడం లేదు. వైసీపీకి ఈ సినిమా వల్ల నష్టమే తప్ప లాభం లేదని ఈ సినిమా ద్వారా ట్రోలర్స్ కు, మీమర్స్ కు మరింత కంటెంట్ ఇచ్చినట్టు అవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

రేటింగ్ : 1.5/5.0

 

Related Articles

ట్రేండింగ్

Union Minister Piyush Goyal: వైఎస్సార్ ను సైతం ముంచేసిన సీఎం జగన్.. ఆ కేసులో కావాలనే ఇరికించారా?

Union Minister Piyush Goyal: వైయస్సార్ కాలనీ పట్ల కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనపట్ల విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
- Advertisement -