YSRCP: మూడు రాజధానులపై వైసీపీ యాక్షన్ ప్లాన్.. ఇకపై మూడు ప్రాంతాల్లోనూ ఉద్యమం

YSRCP:  ఏపీలో మూడు రాజధానులపై వైసీపీ భారీ స్కెచ్‌లు వేస్తోంది. మూడు రాజధానులకు ప్రజల మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామాల పేరుతో కొత్త డ్రామాకు తెరలేపారు. అవసరమైతే మూడు రాజధానుల కోసం రాజీనామా చేస్తామంటూ మంత్రులు., వైసీపీ ఎమ్మెల్యే చేస్తున్న ప్రకటన వెనుక భారీ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. మూడు రాజధానలు సెంటిమెంట్‌ను ప్రజల్లో రగిల్చాలనే వ్యూహం వైసీపీ చేస్తున్నట్లుగా ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్న క్రమంలో వైసీపీ ఈ కొత్త ప్లాన్ మొదలుపెట్టింది. అమరావతి రైతులను ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో పాటు ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు అమరావతి రైతులు పాదయాత్రపై చేస్తోన్న వివాదాస్పద వ్యాఖ్యలు కలకలం రేపుతోన్నాయి.

ఇప్పటికే విశాఖలో మూడు రాజధానుల మద్దతుగా జేఏసీ ఆధ్వర్యంలో వైసీపీ గర్జన సభ నిర్వహించింది. జోర వర్షంలోనూ వైసీపీ నేతలు గర్జన సభ నిర్వహించారు. కొడాలి నాని, రోజాతో పాటు ఉత్తరాంధ్రకు చెందిన నేతలు ఈ గర్జన సభకు హాజరయ్యారు. అయితే ఇప్పటివరకు ఉత్తరాంధ్రలోనే మూడు రాజధానుల ఉద్యమం చేపట్టిన వైసీపీ.. ఇక రాష్ట్రంలోని రాయలసీమ, కోస్తాంధ్రలోనూ చేసేందుకు కసరత్తులు చేస్తోంది. మూడు ప్రాంతాల్లోనూ మూడు రాజధానులకు ప్రజల మద్దతు కూడగట్టాలని వైసీపీ చూస్తోంది. త్వరలోనే రాయలసీమలోనూ మూడు రాజధానుల ఉద్యమం చేపట్టాలని వైసీపీ చూస్తోంది. మూడు రాజధానులు చేపడితే కర్నూలులో హైకోర్టు వస్తుందని, దీని ద్వారా రాయలసీమ అభివృద్ధి చెుందుతుందని వైసీపీ ప్రజలకు చెప్పనుంది.

వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఈ ఉద్యమానికి నేతృత్వం వహించనున్నారని వార్తలు వస్తున్నాయి. రాయలసీమ మొత్తం ర్యాలీలు, ధర్నాలు, గర్జన సభలు నిర్వహించాలని వైసీపీ చూస్తోంది. ఇక కోస్తాంధ్రలోనూ త్వరలోనే మూడు రాజధానులకు మద్దతుగా సభలు నిర్వహించాని చూస్తోంది. రాష్ట్రం మొత్తం మీద మూడు రాజధానుల ఉద్యమాన్ని ఉదృతం చేయాలని చూస్తోంది. అయితే హైకోర్టు కేంద్రం పరిధిలో ఉంటుందని, రాష్ట్ర పరిధిలో ఉండదు. అలాంటప్పుడు మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే కర్నూరులో హైకర్టులో వస్తుంనది వైసీపీ నేతలు రాయలసీమలో ఎలా ఉద్యమం చేస్తారని కొంతమంది ప్రశ్నిస్తున్నారు.ఇఫ్పటికే ఉత్తరాంధ్రలో రౌండ్ టేబుల్ సమావేశాలు, గర్జన సభలతో వైసీపీ మూడు రాజధానలు ఉద్యమాన్ని చేపట్టింది. కానీ ప్రజల నుంచి ఎక్కువ మద్దతు రాలేదు. అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలతోనే సభ ముగిసింది.

ఇక విశాఖ ఎయిర్ పోర్ట్ వద్ద మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య చోటుచేసుకున్న రాళ్ల దాడితో టాపిక్ మొత్తం అటువైపు మళ్లింది. ఈ దాడి కేసులో జనసేన కార్యకర్తలు అరెస్ట్ చేయడం, పవన్ కల్యాణ్ పర్యటనను అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. పవన్ కల్యాణ్ రెండు రోజుల పాటు విశాఖలోనే ఉన్నారు. అరెస్ట్ చేసిన జనసేన కార్యకర్తలు, నేతలను విడుదల చేసేంతవరకు విశాఖలోనే ఉన్నారు. చివరికి జనసేన నేతలు, కార్యకర్తలకు బెయిల్ రావడంతో విశాఖ నుంచి విజయవాడకు చేరుకున్నారు. దీంతో మూడు రాజధాలను ఉద్యమం మొత్తం డైవర్ట్ అయ్యి పవన్ టూర్, జనసే న కార్యకర్తల అరెస్ట్ పరిణామాల వైపు మళ్లింది. ఆ తర్వాత పనవ్ కల్యాణ్ ను చంద్రబాబు అనూహ్యంగా ఐదేళ్ల తర్వాత కలడంతో మూడు రాజధానుల టాపిక్ గురించే ప్రజలు మర్చిపోయారు.చంద్రబాబు,పవన్ భేటీ గురించే రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -