YSRCP: శవ రాజకీయాలతో నవ్వుల పాలవుతున్న వైసీపీ.. ముసలోళ్లను సైతం వదలట్లేదా?

YSRCP: వైసీపీ అధినేత జగన్ కు శవాలతో రాజకీయం రక్తికట్టించడం బాగా తెలుసు. ఆయన మొదటి నుంచి శవాలను అడ్డం పెట్టుకొనే రాజకీయాలు చేస్తున్నారు. మొదట తన తండ్రి శవాన్ని పక్కనే పెట్టుకొని సీఎం పదవి కోసం సంతకాలు సేకరించారనే ఆరోపణ ఉంది. ఈ విషయంలోనే జగన్ ను చాలా మంది కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకించారు. ఇలాంటి వ్యక్తి ఉంటే పార్టీకి ప్రమాదమని భావించి.. ఆయన ఓదార్పు యాత్ర చేసినా.. ఎవరూ పట్టించుకోలేదు. అలా వైసీపీ పార్టీనే తన తండ్రి శవం అనే పునాదులపై నిర్మించారు. అక్కడి నుంచి మొదలైన శవరాజకీయాలు జగన్ కొనసాగిస్తూ వస్తున్నారు. తండ్రి పేరుతో శవరాజకీయం చేసి పార్టీని స్థాపించిన జగన్.. బాబాయ్ పేరుతో శవరాజకీయం చేసి అధికారంలోకి వచ్చారు. 2019 ఎన్నికల నాటి వివేకా హత్య రూపంలో మరో ఇద్దరు మహిళలు జగన్ కు దొరికారు. అదే వివేకా కుమార్తె వైఎస్ సునీత, వివేకా భార్య సౌభాగ్యమ్మ. తన చెల్లికి తండ్రి లేకుండా చంద్రబాబు చేశారు.. తన చిన్నమ్మకు పసుపుకుంకుమ చెరిపేశారని గత ఎన్నికల ముందు ప్రచారం రక్తి కట్టించారు. ఎలాగోలా ఎన్నికల్లో గట్టెక్కి అధికారంలోకి వచ్చారు.

చివరికి టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ మరణాన్ని కూడా ప్రతీసారీ రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్టీఆర్ నుంచి పార్టీ, అధికారం చంద్రబాబు చేతికి బదిలీ అయ్యి నలబై ఏళ్లు అవుతున్నా.. ఆ విషయాన్ని కూడా రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు.. టీడీపీ శ్రేణులు, ప్రజలు తమ నాయకుడిగా అంగీకరించారు. అయినా.. జగన్ పైశాచికం ఆగడం లేదు. ఎన్నికలు వచ్చిన ప్రతీసారీ ఎన్టీఆర్ మరణాన్ని రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇప్పుడు పింఛన్ పంపిణీలో వడదెబ్బ తగిలి వృద్దుల చనిపోతున్నారు. కానీ.. దాన్ని కూడా రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పింఛన్ తీసుకోవడానికి వచ్చి చనిపోతున్నవారంతా టీడీపీ చర్యల మూలంగానే చనిపోయారని ఆరోపిప్తున్నారు. వాలంటీర్లు లేకపోవడం వల్లే పింఛన్ల పంపిణీ నిలిచిపోయిందని చెబుతోంది. అందుకు కారణం, చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ అని ఆరోపిస్తున్నారు

టీడీపీ ఫించన్ల పంపిణీకి వాలంటీర్లను దూరంగా ఉంచాలని టీడీపీ ఈసీకి లేఖ రాసింది. వాలంటీర్లు ఓటర్లు ప్రలోభాలకు గురి చేస్తారని వారిని విధులకు దూరంగా ఉండాలని ఈసీ ఆదేశించింది. ఈసీ వాలంటీర్లను విధులకు దూరంగా ఉంచిన మాట వాస్తవమే. కానీ, ఫించన్ల పంపిణీని నిలిపివేయాలని ఎక్కడా చెప్పలేదు. అంతేకాదు.. ఫించన్లు పంపిణీకి గైడ్ లైన్స్ కూడా జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు ఫించన్లు పంపిణీ చేయాలని చెప్పింది. వాలంటీర్లు ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.

దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో బాధ‌ప‌డేవారు, అస్వ‌స్థ‌త‌కు గురైన‌వారు, మంచాన‌ప‌డ్డవారు, వృద్ద వితంతువుల‌కు ఇంటివ‌ద్ద పంపిణీ చేయాల‌ని ఆదేశించింది. కానీ.. వారిని కూడా ఎందుకు సచివాలయాలకు పిలిపించుకున్నారు? దానికి వైసీపీ దగ్గర సమాధానం లేదు. లక్షన్నకు పైగా సచివాలయ సిబ్బంది ఉన్నారు. వారిలో కొంతమందిని వినియోగించుకున్నా.. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో బాధ‌ప‌డేవారు, అస్వ‌స్థ‌త‌కు గురైన‌వారు, మంచాన‌ప‌డ్డ వారు, వృద్ద వితంతువుల‌కు పెన్షన్ పంపిణీ చేయొచ్చు. కానీ.. అలా చేస్తే ఇలాంటి శవరాజకీయాలు చేయలేమనే ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. ఇప్పుడు వడదెబ్బకు వృద్దులు చనిపోతున్నారు. వారితో రాజకీయం చేయడానికి వైసీపీకి అవకాశం దక్కింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -