BJP-YCP: బీజేపీకి దగ్గరవుతున్న వైసీపీ.. మోదీ సపోర్ట్ ఉంటే జగన్ కు తిరుగులేదా?

BJP-YCP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం గందరగోల పరిస్థితులలో ఉన్నాయి. వచ్చే ఎన్నికలలో ఎలాగైనా అధికార పీఠం అందుకోవాలని అన్ని పార్టీలు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే వైసిపి ఒంటరిగా ఎన్నికల పోటీకి సిద్ధమవుతుండగా తెలుగుదేశం మాత్రం పొత్తుకు మొగ్గు చూపుతుంది.తెలుగుదేశం పార్టీ కూడా ఒకవైపు బిజెపితోను మరోవైపు జనసేనతో కూడా పొత్తు పెట్టుకోవాలని ఆలోచనలో ఉన్నప్పటికీ ఇంకా ఈ విషయం గురించి ఎలాంటి క్లారిటీ రాలేదు.

ఇకపోతే కేంద్రంలో కొన్ని బిల్లులను ఆమోదించడం కోసం బీజేపీ ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితులలో వైసీపీతో పొత్తుకు సిద్ధమవుతుందని తెలుస్తోంది. ఈ ఏడాది బీజేపీకి చాలా కీలకమైనది. ఎన్నో ముఖ్యమైన బిల్లులను వరసబెట్టి ఆమోదించుకోవాలని బీజేపీ భావిస్తోంది.వీటికి రాజ్యసభలో మద్దతు దక్కాలి అంటే 9 మంది ఎంపీలు ఉన్నటువంటి వైసీపీ పార్టీకి బిజెపి ప్రభుత్వం స్నేహపూర్వకంగా మెలగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 

రాజ్యసభలో కీలకమైన బిల్లులు ఆమోదం కావాలి అంటే వైసిపి ఓట్లు బిజెపికి పడాల్సిందే. ఈ క్రమంలోనే బిజెపి ప్రభుత్వం వైసీపీకి అనుగుణంగా నడుచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనినే అవకాశంగా తీసుకొని వైసిపి ప్రభుత్వం రాష్ట్ర రాజకీయాలలో కూడా కీలక మలుపు తిప్పబోతుందని తెలుస్తోంది. ఇదే అవకాశంగా భావించి వైఎస్ఆర్సిపి పార్టీ కేంద్రం నుంచి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ అవకాశాన్ని ఉపయోగించుకోబోతున్నారని తెలుస్తుంది.

 

ఇక బిజెపికి రాజ్యసభలో ఒక ఎంపీ సీటు ఉంది ఈ ఓటు కూడా వారికి కీలకమే కానీ 9 ఓట్లు ఉన్నటువంటి వైసీపీ పార్టీ మరింత కీలకంగా మారింది. ఇక మొన్న జరిగిన ఎన్డీఏ సమావేశాలలో భాగంగా తెలుగుదేశం పార్టీకి ఏ విధమైనటువంటి పిలుపు రాకపోవడంతో బిజెపికి టిడిపి అవసరం లేదని ఈ సందర్భంగా చెప్పగానే చెప్పేశారు. మరి బిజెపి టిడిపి పొత్తు కుదుర్చుకుంటారా లేదా అన్నది కొన్ని మిలియన్ డాలర్ల ప్రశ్న అయినప్పటికీ బిజెపి మాత్రం వైసీపీతో పొత్తుకు సిద్ధమవుతు కేంద్ర రాష్ట్ర రాజకీయాలను కూడా కీలక మలుపు తిప్పబోతున్నారని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -