Why Not 175: వైనాట్ 175 ధీమా వెనుక భారీ కుట్ర జరుగుతోందా.. ఏపీలో అన్ని ఓట్లు గల్లంతయ్యాయా?

Why Not 175: వైసీపీ వై నాట్ 175 అని వైసీపీ పార్టీ ఎప్పటినుంచో ధీమాగా చెప్తుంది. అయితే దీని వెనక పెద్ద కుట్ర ఉంది అని ప్రత్యర్థి రాజకీయ వర్గాలు ఎప్పటినుంచో చెప్తున్నాయి. అందులో భాగంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఓట్ల గల్లంతు కుట్ర ఇప్పుడు బయట పడుతున్నది. ప్రతి నియోజకవర్గంలోని కనీసం 10 వేల తెలుగుదేశం సానుభూతి ఓట్లు తొలగిస్తే గెలుపు వైకాపాదే అన్నది ఆ పార్టీ యొక్క ధీమా.

అయితే ఇదంతా సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో పక్కా ప్లాన్ తో అమలు చేస్తున్నారు అంటున్నారు పరిశీలకులు. ఈ విషయంపై ఇప్పటికే పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెలువత్తాయి. తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి నియోజకవర్గాలలో భారీగా ఈ ఓట్ల తొలగింపుని చేపట్టడంతో అక్కడ తెలుగుదేశం నేతలు ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు ఈసీకి ఫిర్యాదు చేశారు. అప్పుడు అధికారులు విచారణ ప్రారంభించినప్పుడు అసలు బండారం బయటపడింది.

ఇద్దరు అధికారులపై వేటు కూడా పడింది. ఎన్నికల విధులకు సంబంధం ఉన్న అధికారుల బదిలీపై ఎన్నికల కమిషన్ నిషేధం కూడా విధించింది. ప్రస్తుతం తెలుగుదేశం అధినేత అక్రమ అరెస్టుతో ఇటు నేతలు, అటు క్యాడర్ అంత ఆవైతే దృష్టి మరల్చారు. అరెస్టుకు నిరసనగా కార్యక్రమాలు, వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇలాంటి సమయంలో మరొకసారి వైకాపా ఫామ్ సెవెన్ తో ఈ ఓట్ల తొలగింపు కు సిద్ధమైనట్లు తెలుస్తున్నది.

ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా భారీగా ఓట్లు గల్లంతయినట్లు తెలుస్తుంది. ఈ కొత్త ఓవర్ లిస్టు ఈనెల 27న రాబోతుంది. అప్పుడు ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు లేపేసారో బయటపడుతుంది. ఇలాంటిదే ఏదో జరుగుతుంది అని తేదేపే వర్గం వారు ఎప్పటినుంచో చెప్తున్నారు. అసలు వై నాట్ 175 అనేంత కాన్ఫిడెంట్ కి ఎలా వచ్చిందన్న అనుమానాలు రాజకీయ వర్గాలను వెంటాడాయి. అయితే ఈ కాన్ఫిడెంట్ తమ ప్రభుత్వం ప్రజలను అంత గొప్పగా ఉద్ధరించడం వలనో, పాలన సురక్షితంగా సాగటం వలనో వచ్చింది కాదు అన్న నిజం ఇప్పుడు బయటపడింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -