NTR: జూనియర్ ఎన్టీఆర్ పేరు వాడుకుని గొడవ చేస్తున్న వైసీపీ నాయకులు… మరి ఇంతలా దిగజారాలా…

NTR: టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ కి మధ్య దూరం ఉందనేది మాట వాస్తవం. ఇటీవల చంద్రబాబు నాయుడు జైలుకెళ్ళినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కనీసం సానుభూతిగా ఒక పోస్ట్ కూడా పెట్టలేదు ఒక మాట కూడా చెప్పలేదు. తర్వాత చంద్రబాబు జైలు నుండి విడుదలైన తర్వాత కూడా కనీసం పరామర్శించడానికి కూడా జూనియర్ ఎన్టీఆర్ వెళ్లలేదు. ఈ విషయం పైన ముందు నుంచి టిడిపి అభిమానులు ఆందోళన చేశారు. ఎన్టీఆర్ మనవడుగా చంద్రబాబు మేనల్లుడుగా జూనియర్ ఎన్టీఆర్ కి కనీస బాధ్యత ఉందని చెప్పుకొచ్చారు.

 

అయితే 2009 ఎన్నికల్లో టిడిపి తరఫున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం కూడా చేశారు. తర్వాత 2014 ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ టిడిపి ప్రస్తావన కూడా తీసుకురాలేదు.
కనీసం ఎన్నికల ప్రచారానికి కూడా రాలేదు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ని చంద్రబాబు కావాలని దూరం పెట్టారని వార్తలు బయట సృష్టించారు. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వస్తే లోకేష్ కి తగిన గుర్తింపు రాదని ఉద్దేశంతోటే చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ ని దూరం పెడుతున్నారని పలువురు గిట్టని వారు చెబుతున్న మాటలు. అయితే చాలా సందర్భాల్లో జూనియర్ ఎన్టీఆర్ అతనికి రాజకీయాలతో సంబంధం లేదన్నట్లు మాట్లాడారు. లోకేష్ కూడా ఎన్టీఆర్ టీడీపీలోకి వస్తానంటే మాకు ఎటువంటి ఇబ్బంది లేదని ఎవరైనా వచ్చి పార్టీ కోసం పనిచేయవచ్చు అని స్పష్టం చేశారు.

తాజాగా చంద్రబాబునాయుడు తిరువూరులోనూ ఆచంటలోనూ రా కదలిరా అనే సభను నిర్వహించారు. ఈ సభలో టిడిపి నాయకులతో పాటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా పాల్గొన్నారు. అయితే చంద్రబాబు ప్రసంగించేటప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ప్లకార్డులు ప్రదర్శించారు ఎన్టీఆర్ ఫోటోతో కూడిన బ్యానర్లు చూపుతూ ఎన్టీఆర్ కి న్యాయం చేయాలని టిడిపిలోకి తీసుకురావాలని నినాదాలు చేశారు. ఎన్టీఆర్ అభిమానులు గోల మరింత ఎక్కువ అవ్వడంతో టిడిపి వాలంటీర్లు వారిని వారించిన వినడం లేదు. చేసేది ఏమీ లేక టిడిపి వాలంటీర్లు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను బయటకు తోసేశారు. అయితే ఇదంతా ఎన్టీఆర్ అభిమానులు ముసుగులో వైసిపి నాయకులు, కార్యకర్తలు చేస్తున్న పని అని పలువురు ఆరోపిస్తున్నారు. వైసిపి నాయకులు మరీ ఇంతలా దిగజారి పోవాలా అంటూ చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -