YCP MLA: సుచరిత రూట్‌లో మరో వైసీపీ ఎమ్మెల్యే.. కీలక పదవికి రాజీనామా

YCP MLA: ఏపీ మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత ఇటీవల గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవి రాజీనామా చేసిన విషయం తెలిసిందే ఈ మేరకు సీఎం జగన్ కు తన రాజీనామా లేఖను పంపించారు. తన నియోజకవర్గ రాజకీయాలకు మాత్రమే తాను పరిమితం అవుతానని ఆమె రాజీనామా లేఖలో చెప్పుకొచ్చారు. మంత్రివర్గ విస్తరణలో ఆమెను మంత్రి పదవి నుంచి జగన్ తొలగించారు. ఆ తర్వాత అసంతృప్తితో వైసీపీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు ఆమె సిద్దమ్యారు. కానీ ఆ తర్వాత జగన్ వాదించడంత రాజీనామాపై సుచరిత వెనక్కి తగ్గారు.

 

సుచరిత బాటలోనే మరో వైసీపీ నేత నడిచారు. అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్ష పదవికి తాజాగా కాపు రామచంద్రారెడ్డి రాజీనామా చేవారు. ఈ మేరకు జగన్ కు రాజీనామా లేఖ పంపారు. రాయదుర్గం నియోజకవర్గంపై ఎక్కువ దృష్టి పెట్టడంతో పాటు తన కుటుంబంలో జరిగిన విషాదంతో జిల్లా అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు లేఖలో పేర్నొన్నారు. జిల్లా అధ్యక్షుడిగా తన స్థానంలో మరొకరిని నియమించాలని జగన్ ను కోరారు.

 

గత ఎన్నికల్లో రాయదుర్గం నియోజకవర్గం నుంచి కాపు రామచంద్రారెడ్డి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన.. కాంగ్రెస్ పార్టీ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2012 ఉపఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఆయన.. ఆ తర్వాత 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత తిగిరి2019 ెన్నికల్లో గెలిచారు. కాపు రామచంద్రారెడ్డి అల్లుడు మంజునాథ్ రెడ్డి గత ఏడాది ఆగస్టులో ఆత్మహత్య చేసుకున్నారు. అప్పటినుంచి ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది.అందులో భాగంగానే ఆయన రాజీనామా చేసినట్లు చెబుతున్నారు. కానీ వైసీపీ జిల్లా అధ్యక్షులు వరుస పెట్టి రాజీనామాలు చేస్తుండటం వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. గత కొద్దిరోజుల క్రితం సుచరిత రాజీనామా చేయగా.. ఇప్పుడు కాపు రామచంద్రారెడ్డి రాజీనామా చేయడం గమనార్హం.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -