Hero Shivaji: ఆ పార్టీతో టచ్ లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు.. శివాజీ సంచలన వ్యాఖ్యలు!

Hero Shivaji: ఆంధ్రప్రదేశ్ లో గత ఎన్నికల్లో బంఫర్ మెజారిటీతో గెలిచారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కనివినీ ఎరుగని రీతిని ప్రతిపక్షాలను చిత్తు చేసి 151 ఎమ్మెల్యే సీట్లు సాధించారు. నాలుగు దశాబ్దాల చరిత్ర కలిసిన తెలుగుదేశం పార్టీని మట్టికరించారు జగన్. ఆ తర్వాత తన మార్క్ పాలన కోసం చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. రివర్సీ టెండర్లని ప్రవేశ పెట్టారు. మూడు రాజధానుల సిద్ధాంతాన్ని తెచ్చారు. ఫ్రీ స్కీంను ఇస్తున్నారు. కానీ, అభివృద్ధి మాత్రం లేదని ప్రజలు వాపోతున్నారు. దీంతోనే జనంలో తీవ్ర వ్యతిరేకత వచ్చినట్లు ఆ పార్టీ ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు.

 

రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత అనేక కష్టాలు పడ్డారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఓదార్పు యాత్ర, పాదయాత్ర ద్వారా ప్రజలతో మమేకం అయ్యారు. తనకన్నా మంచి పాలన అందిస్తానని చెప్పి 2019 ఎన్నికల్లో గెలిచారు. అయితే రాజశేఖర్ రెడ్డికి భిన్నంగా పాలన సాగిస్తున్నారని వైసీపీ నాయకులే అంటున్నారు. కేవలం మూడున్నరేళ్ల కాలానికే జగన్ అధికార ప్రవర్తన అర్ధమైపోయిందని చెబుతున్నారు. అధికారాన్ని అంతా తన చేతిలో పెట్టుకున్న జగన్, ఎమ్మెల్యేలను, ఎంపీలను ఆట బొమ్మలు చేశారని ప్రతిపక్షాలు మెుదటి నుంచి విమర్శించాయి. ఇప్పుడిప్పుడు ఆ పార్టీపై నిరసన గళం వినిపిస్తున్న నాయకులు సైతం అదే చెబుతున్నారు.

ఇక ఎప్పూడూ తనదైన మాటలతో ఆకట్టుకునే యాక్టర్ శివాజీ, జగన్ గవర్నమెంట్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పని అయిపోయిందని, వచ్చే ఎన్నికల్లో గెలవరని స్పష్టం చేశారు. ఇప్పటికే వైసీపీ చెందిన 49 ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు వేరే పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నారని వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయల్లో కుదుపు వచ్చింది. అసలు వేరే పార్టీలతో టచ్ లో ఉన్న ఆ ప్రజాప్రతినిధులు ఎవరని ప్రజలంతా మాట్లాడుకుంటున్నారు. ఇక జగన్ కూడా ఈ సమాచారం తెలియటంతో కంగుతున్నిట్లు సమాచారం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -