YSRCP: కేంద్రంతో పోరుకు వైసీపీ సై.. రాజధానుల నిర్ణయంపై ప్రవేట్ బిల్లు

YSRCP: గత ఎన్నికల్లో వైసీపీకి సహకరించిన బీజేపీ ఇప్పుడు కాస్త దూరం అవుతోంది. జగన్ ప్రభుత్వానికి అసలు సహకరించడం లేదు. నిధుల విషయంలో కూడా ఏపీ ప్రభుత్వాన్ని పట్టించుకోవడం లేదు. సీఎం జగన్ కూడా నిధుల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకోవడం లేదు. రాష్ట్రానికి నిధుల విషయంలో మొండిచెయ్యి చూపిస్తున్నా.. జగన్ మాత్రం సైలెంట్ గా ఉండిపోయారు. కేంద్రాన్ని అసలు ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా అనడం లేదు. ప్రతి అంశంలో ఎన్డీయేకు సపోర్ట్ చేస్తోంది వైసీపీ. బీజేపీతో పెట్టుకుంటే నష్టం జరుగుతుందని భావించే జగన్ సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.

గత ప్రభుత్వం చంద్రబాబు బీజేపీతో గొడవ పెట్టుకుని నష్టపోయారు. చంద్రబాబు మీద కోపంతో జగన్ కు బీజేపీ అన్ని రకాలుగా సపోర్ట్ చేసింది. బీజేపీ సహకరించడం వల్లనే వైసీపీ అధికారంలోకి రాగలిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్న నేపథ్యంలో వైసీపీ రూటు మార్చుతున్నట్లు కనిపించింది. ఇప్పటివరకు బీజేపీ పట్ల సానుకూలంగా కనిపించిన వైసీపీ.. ఇప్పుడు కేంద్రంపై యుద్దం ప్రకటించేందుకు సిద్దమవుతోంది. ఇప్పటివరకు కేంద్రాన్ని అసలు ప్రశ్నించిన వైసీపీ.. మెల్లమెల్లగా మాట పెంచుతోంది.

దీంతో ఏపీలో బీజేపీ, వైసీపీ మధ్య గ్యాప్ పెరుగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల పోలవరం ముంపు మండలాల్లో పర్యటించిన సీఎం జగన్.. కేంద్ర తీరును ప్రశ్నించారు. పరిహారం కోసం కేంద్రంతో యుద్దం చేయాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. అప్పటినుంచి కేంద్ర తీరును వైసీపీ నేతలు ప్రశ్నిస్తూ వస్తున్నారు. అయితే తాజాగా రాజ్యసభ వేదికగా కేంద్రం తీరుపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు కురిపించారు. అసెంబ్లీకి మూడు రాజధానులను నిర్ణయించే అధికారం ఉండేలా చట్ట సవరణ చేయాలని విజయసాయిరెడ్డి ఓ బిల్లు ప్రవేశపెట్టారు.

రాజధానులపై అసెంబ్లీకి స్పష్టమైన అధికారం ఉండేలా చట్ట సవరణ చేయాలని ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టారు. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రాజధానులు ఏర్పాటు చేసే అధికారం అసెంబ్లీకి ఉందన్నారు. ఆర్టికల్ 3ఏని చేరుస్తూ రాజ్యంగ సవరణ చేపట్టడం ఈ బిల్లు ఉద్దేశం అని పేర్కొన్నారు. రాజ్యంగ సవరణ చేస్తే ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మార్చుకుంటూ పోతే ఎలా అనే దానిపై కేంద్రం ఆలోచిస్తుంది. గతంలో అమరావతి రాజధానిగా కేంద్రం గుర్తించింది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా వచ్చి రాజధానికి శంకుస్థాపన చేశారు. అయితే జగన్ ప్రభుత్వం వచ్చి మూడు రాజధానులు ఏర్పాటు చేసిన తర్వాత దీనికి కేంద్రం మద్దతు తెలపడం లేదు.

రాష్ట్ర బీజేపీ నేతలు కూడా అమరావతినే రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో కేంద్రం కూడా మూడు రాజధానులను గుర్తించలేదు. తమ లెక్కల్లో మాత్రం రాజధాని అమరావతి అని ఉందని చెబుతున్నారు. అయితే కేంద్రం తన అధికారాన్ని వదులుకుని రాజధాని నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో పెడుతుందా? లేదా? అనేది చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -