YCP: టీడీపీ దెబ్బకు గజగజా వణుకుతున్న వైసీపీ.. ఏం జరిగిందంటే?

YCP: విరిచేస్తా.. పొడిచేస్తా.. వందమందిని ఒకే దెబ్బకు లేపేస్తా.. విరాటరాజ్యంపై కౌరవులు దండయాత్ర చేసినపుడు ఇంట్లో కూర్చొని ఉత్తరకుమారుడు చెప్పిన మాటలివి. యుద్దం రంగంలోకి దిగిన తర్వాత కౌరవసేనను చూసి అదే ఉత్తరకుమారుడు మూర్చపోయాడంట. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. ద్వాపరయుగంలో ఉత్తర కుమారుడికి.. కలియుగంలో జగన్‌కు ఏం తేడా లేదని వైసీపీ ఇప్పుడు ట్రోల్ చేస్తోంది.

 

చంద్రబాబు ఢిల్లీ నుంచి వెళ్లి వచ్చిన తర్వాత జగన్ కూడా ఆఘమేఘాల మీద హస్తినకు వెళ్లారు. అయితే, ఢిల్లీ పర్యటనపై జగన్ అనుకూల మీడియా, వైసీపీ నేతలు ఒక్కోరకంగా ప్రచారం చేశారు. విభజన హామీలు, ప్రత్యేకహోదా కోసం వెళ్లారని ఆన్ ది రికార్డు ప్రచారం జరిగింది. కానీ, ఆఫ్ ది రికార్డ్ మాత్రం టీడీపీ, బీజేపీ పొత్తును ఆపేందుకు వెళ్లారని చెప్పుకొచ్చారు. అదేదో సినిమాలో బాబు ల్యాండ్ అయితే అపోజిషన్‌కు బ్యాండే అన్నట్టు.. ఢిల్లీలో జగన్ అడుగుపెడితే టీడీపీ కూశాలు కదిలిపోతాయని రచ్చ రచ్చ చేశారు.

ఆన్ ది రికార్డు చెప్పినట్టు సీఎం జగన్ నిజంగానే ప్రత్యేకహోదా, విభజన హామీల గురించే వెళ్తే ఏం సాధించి తీసుకొని వచ్చారో తెలియదు. కనీసం ప్రధాని మోడీ ఏమైనా హామీ ఇచ్చారా అనేది కూడా తెలియదు. అయినా కేంద్రం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టిన తర్వాత కేంద్రపెద్దలతో కలిసినా ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఆ మాత్రం జగన్ కు తెలియదా? అది తెలియకుండానే వెళ్లారా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. దీంతో.. ఆయన విభజన హామీల కోసం వెళ్లలేదు అని టీడీపీ ప్రచారం అనుమానిస్తోంది.

 

కేవలం ఎన్డీఏలో టీడీపీ చేరికను అడ్డుకోవడానికే జగన్ ఢిల్లీకి వెళ్లారని చర్చ నడుస్తోంది. కానీ, ఈ విషయంలో కూడా ఆయన చుక్కెదురైనట్టు తెలుస్తోంది. ఎందుకుంటే.. టీడీపీ, బీజేపీ పొత్తులపై మాట్లాడటానికే వెళ్లారని తెలిసి అమిత్ షా కలిసేందుకు అపాయింట్‌‌మెంట్ కూడా ఇవ్వలేదని ఢిల్లీ వర్గాలలు చెబుతున్నాయి. అయితే, బీజేపీ, టీడీపీ కలవొద్దని చెప్పడానికి జగన్ ఎవరు అని కేంద్రం పెద్దలు రాష్ట్ర బీజేపీ నేతలతో కూడా చెప్పినట్టు టాక్ నడుస్తోంది. అంతేకాదు.. మొన్న వచ్చిన ఇండియా టుడే సర్వే కూడా బీజేపీ చేయించిందట. ఏపీలో 17 లోక్‌సభ స్థానాలను టీడీపీ గెలుచుకుంటుందని ఆ సర్వేలో తేలడంతో టీడీపీతో కలవడమే మంచిదని అమిత్ షా డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.

 

నిజానికి చంద్రబాబు మద్దతు బీజేపీకి అవసరం లేదు. సింగిల్ గానే బీజేపీ భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సూచనలు ఉన్నాయి. కానీ, 1984లో ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత కాంగ్రెస్ 404 స్థానాల్లో గెలిచింది. అంతకు ముందు కానీ, ఆ తర్వాత కానీ ఏ పార్టీ లేదా కూటమికి ఆ స్థాయి మెజారిటీ రాలేదు. ఇప్పుడు బీజేపీ మిత్రపక్షాలతో కలిపి ఆ రికార్డును బ్రేక్ చేయాలని చూస్తోంది. అందుకే టీడీపీతో పొత్తుకు సై అంటోంది. కానీ, జగన్ ఆ పొత్తును అడ్డుకోవడానికి ఢిల్లీ వెళ్తే ఆయనకు అక్కడ షాక్ తిగిలింది. కేంద్రమంత్రి అమిత్ షాను కలవకుండానే వెనుదిరిగారు. దీంతో.. ఉత్తరకుమారుడు వచ్చేశాడని టీడీపీ ట్రోల్ చేస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -