Samantha: హీరోయిన్ సమంత కామెంట్లు వింటే షాకవ్వాల్సిందే!

Samantha: తెలుగులో ఎంతో ట్యాలెంట్ ఉన్న యంగ్ హీరోయిన్ల జాబితాలో హీరోయిన్ సమంత టాప్ లో ఉంటుంది. తన మొదటి సినిమా నుండి తనలోని నటనను అంతకంతకు మెరుగుపరుచుకుంటూ వస్తున్న సమంత.. ప్రస్తుతం తెలుగులో లేడీ సూపర్ స్టార్ రేంజ్ లో దూసుకెళుతోంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా టాప్ హీరోలందరితో జతకట్టిన సమంత.. ప్రస్తుతం బాలీవుడ్ వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది.

 

బాలీవుడ్ లో బాగా హిట్ అయిన ‘ఫ్యామిలీమ్యాన్’కు సీక్వెల్ గా వచ్చిన ‘ఫ్యామిలీమ్యాన్2’లో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేసింది. తన నటనతో బాలీవుడ్ జనాలను కూడా ఫిదా చేసిన సమంత.. ప్రస్తుతం ‘శాకుంతలం’ సినిమా చేస్తోంది. ఈ మధ్యనే సమంత లీడ్ రోల్ లో చేసిన ‘యశోద’ సినిమా అందరినీ ఆకట్టుకోవడంతో పాటు నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టడం తెలిసిందే.

 

ప్రస్తుతం ముంబైలో ఎక్కువగా ఉంటున్న సమంతకు సంబంధించిన పాత వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. అందులో ఆమె సె*కు సంబంధించి తన అభిప్రాయాన్ని ఎలాంటి మొహమాటం చేకుండా చెప్పిన విధానం చాలామందిని ఆశ్చర్య పరిచింది. ఎప్పుడూ పద్ధతి గల మగువలాగా కనిపించే సమంత.. సె* గురించి ఇలా ఆలోచిస్తుందా అని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే, మరికొందరు మాత్రం సమంత అభిప్రాయంలో తప్పేముందని ఆమెను వెనకేసుకొస్తున్నారు.

 

ఓ ఇంటర్వ్యూలో సమంతను పలు వ్యక్తిగత విషయాల గురించి అడగగా.. ఆమె ఎలాంటి ఇబ్బంది లేకుండా టకటకా సమాధానాలు చెప్పింది. దాంతో కాస్త చనువు తీసుకున్న యాంకర్.. సె* అంటే ఇష్టమా లేదంటే ఫుడ్ అంటే ఇష్టమా అని అడగగా.. ‘నాకు సె* అంటేనే ఇష్టం, ఫుడ్ లేకపోయినా ఉంటా కానీ అది లేకపోతే మాత్రం అస్సలు ఉండలేను’ అని తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పేసింది. పాత వీడియో ఇప్పటికే నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -