Pawan Kalyan: పవన్ పై ఈ నిర్మాత కామెంట్స్ వింటే షాకవ్వాల్సిందే!

Pawan Kalyan: టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూ మరొకవైపు రాజకీయాలలో యాక్టివ్ గా పాల్గొంటున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ కు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ హీరోకు లేని ఫ్యానీజం పవన్ సొంతం. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతినిండా బోలెడు ప్రాజెక్టులతో బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో యాక్టివ్గా పాల్గొంటున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు ఉండడం వల్ల వీలైనంత తొందరగా సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు పవన్.

 

ప్రచార కార్యక్రమాలు చేస్తూనే మరోవైపు సినిమాలలో నటిస్తున్నాడు. ఇది ఎలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి నేటికీ 27 సంవత్సరాలు పూర్తి అయింది. అదేవిధంగా జనసేన పార్టీ ఆవిర్భావం జరిగి ఈనెల 14 నాటికి 9 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ సందర్భంగా జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని మచిలీ పట్నంలో జరపనున్నారు. దిగ్విజయ భేరీ పేరుతో జరగనున్న సభకు ఇప్పటికే భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ రెండు సందర్భాలను పురస్కరించుకుని పలువురు నిర్మాతలు, దర్శకులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా పవన్ అభిమాన నిర్మాత ఏ.ఎం. రత్నం కూడా పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు తెలిపారు.

ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఏ ఎమ్ రత్నం మాట్లాడుతూ.. మనసేమో ప్రజల మీద. తనువేమో వెండి తెర మీద. రెండింటిలోనూ ప్రజల మనసు చూరగొన్న పవన్ కళ్యాణ్ 27 సంవత్సరాల సినీ జీవితాన్ని.. తొమ్మిది సంవత్సరాల రాజకీయ రంగ ప్రవేశాన్ని పూర్తిచేసుకున్న సందర్భంగా వారికి నా శుభాకాంక్షలు. వారు ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని మనసారా కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు రత్నం. అంతేకాకుండా అభిమానులు రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -