Junior NTR: జూనియర్ ఎన్టీఆర్ ను ఒరేయ్ అని పిలిచే ఒకే ఒక్క స్టార్ హీరో ఎవరో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Junior NTR: టాలీవుడ్ హీరో పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ కు ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ను ఫాలో అయ్యే వారి సంఖ్య మరింత పెరిగింది. అంతేకాకుండా ఈ సినిమాకు గాను ఆస్కార్ అవార్డుని కూడా అందుకున్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాలో నటిస్తున్నారు.

భారీ అంచనాల నడుమ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఇందులో విలన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపు 30 శాతం పూర్తి అయింది. ఈ సినిమాను వీలైనంత తొందరగా పూర్తి చేసి విడుదల చేయాలని మూవీ మేకర్స్ భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించడంతో పాటు అవి సినిమాపై అంచనాలను మరింత పెంచేసాయి. ఈ దేవర సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

 

ఇకపోతే తాజాగా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కు సంబంధించి ఒక వార్త చెక్కర్లు కొడుతోంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ ను ఒరేయ్ అని ఒకే ఒక స్టార్ హీరో పిలుస్తారట. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు అన్న వివరాల్లోకి వెళితే.. ఆ స్టార్ హీరో మరెవరో కాదు నందమూరి బాలకృష్ణ. బాలకృష్ణ అప్పుడప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ని ప్రేమగా ఒరేయ్ అని పిలిచే వారట. అయితే బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్య కాలంలో కలిసి కనిపించకపోయినా వీళ్లిద్దరి మధ్య ఉన్న అనుబంధం ఎంతో గొప్పదని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -