NTR: మాట ఇచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తానే గెలిపిస్తానంటూ?

NTR: 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత తెలుగు దేశం పార్టీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. యంగ్ చీఫ మినిస్టర్ జగన్ టీడీపీ నేతలు, కార్యకర్తలను ఓ ఆట ఆడుకుంటున్నారు. ఆర్థికంగా చిదిమేస్తున్నారు. ఎక్కడికక్కడ నిర్భందాలు చేసేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు గెలుస్తామని జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీలో టీడీపీకి చావోరేవో అన్నట్లు పరిస్థితి మారింది. లోకేశ్ ఉన్నప్పటికీ పెద్దగా రాణించలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఆ పార్టీ ఎన్టీఆర్ వైపు చూస్తోంది. ఈ నేపథ్యంలో తాత స్థాపించిన పార్టీకి అండగా నిలబడాలని జూనియర్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడట.

తెలుగు దేశం పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు తప్పకుండా ఆదుకుంటా అని జూనియర్ ఎన్టీఆర్ అనేమార్లు చెప్పారు. తెలుగు ప్రజలకోసం తాతగారు పెట్టిన పార్టీ టీడీపీ అని చెబుతుంటారు తారక్. 2009 ఎన్నికల్లోనూ పార్టీ కోసం ప్రచారం చేశారు. అయితే అనుకోని ఘటన వల్ల, కొన్ని రోజులే ప్రచారం చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత పార్టీ వైపు తారక్ చూడలేదు. మహానాడుకు కూడా రావటం లేదు. ఇప్పుడు టీడీపీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. రాజకీయ విశ్లేషకులు సైతం ఈ మాట అంటున్నారు.

 

తాజాగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రంపై లోకేశ్ సైతం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన రాజకీయాల్లోకి రావాలని అహ్హానించారు. ఎన్టీఆర్ ఫ్యాన్సు సైతం దీనికి సంతోషించి, సీఎం ఎన్టీఆర్ అంటూ సోషల్ మీడియోల పోస్టులు సైతం పెట్టారు. ఇప్పుడు ఈ విషయం ఎన్టీఆర్ కూడా తెలిసి పార్టీ కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

 

ఏపీలో వచ్చే ఎన్నికలు టీడీపీకి కీలకం కానున్నాయి. అందుకే ఎన్టీఆర్ రావాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ఎన్టీఆర్ సైతం ఓ నిర్ణయానికి వచ్చినట్లు ఆయా వర్గాల ద్వారా తెలిసింది. టీడీపీని 175 స్థానాలలో కచ్చితంగా గెలిపిస్తానని జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు, బాలయ్యలకు మాట ఇచ్చారని తెలుస్తోంది. పార్టీ గెలుపుకు సంబంధించి బాధ్యతలు పూర్తిగా తనవేనని ఆయన చెప్పినట్టు సమాచారం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -