Sameera Reddy: పెళ్లికి ముందే గర్భవతి అయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ లవర్.. ఏం జరిగిందంటే?

Sameera Reddy: ఏంటి? ఎన్టీఆర్ లవర్ ఏంటి ? పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ కావడం ఏంటి అని అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే. జూనియర్ ఎన్టీఆర్ తన కెరియర్ లో ఎంతో మంది హీరోయిన్లతో కలిసి పనిచేసిన విషయం తెలిసిందే. ఎంతోమంది హీరోయిన్లతో నటించినా ఏ హీరోయిన్ తో రానిప్రేమ గాసిప్పులు ఒక హీరోయిన్ విషయంలో మాత్రం వచ్చాయి. కొన్ని వందల సంఖ్యలో గాసిప్పులు వీరిద్దరి మధ్య పుట్టుకొచ్చాయి. ఆ హీరోయిన్ మరెవరో ? కాదు మన తెలుగు అమ్మాయి సమీరా రెడ్డి. ఈమెది ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలోని పెనుగొండ మండలం ఐతంపూడి.

చిన్నప్పుడే ఆమె ఫ్యామిలీ ముంబైలో సెటిల్ అవ్వడంతో సమీరా రెడ్డి కూడా ముంబైలో మోడల్గా కెరీర్ ప్రారంభించి తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె ఎన్టీఆర్ కి జోడిగా నరసింహుడు, అశోక్ సినిమాలలో నటించింది. అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆడలేదు. ఇదే సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, ఎన్టీఆర్ కూడా సమీరా రెడ్డిని ఇష్టపడ్డాడని అప్పట్లో తెగ వార్తలు వినిపించాయి. ఆ తర్వాత సమీరా రెడ్డి బాలీవుడ్ కి వెళ్లి అక్కడ కొన్ని సినిమాలలో హీరోయిన్గా నటించి సక్సెస్ అయింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సమీరా రెడ్డి సంచలన విషయాలను వెల్లడించింది. త‌న పెళ్లి విషయంలో కొందరు చేసిన విమర్శలు తనకు చాలా బాధను కలిగించాయి. 2014లో అక్షయ్‌తో నా పెళ్లి జరిగింది. మా ఇంటి టెర్రస్‌ పైనే మేము పెళ్లి సింపుల్‌గా చేసుకున్నాము.

 

నేను సీక్రెట్ గా పెళ్లి చేసుకోవడంతో కొందరు నేను పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ అయ్యాన‌ని కామెంట్ లు చేశారు. అందులో ఎటువంటి నిజం లేదు. అవన్నీ వట్టి రూమర్సే. మా పెళ్లి పెద్దల అంగీకారంతోనే చాలా సింపుల్ గా జరిగింది. పెళ్లి తర్వాత ప్రెగ్నెన్సీ సమయంలో నేను ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొన్నాను అని చెప్పుకొచ్చింది సమీరా రెడ్డి

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -