YS Jagan Reddy: జగన్ రెడ్డి చివరి సభ మళ్లీ వాయిదా పడిందట.. పొత్తు ఎఫెక్ట్ మామూలుగా లేదుగా!

YS Jagan Reddy: సీఎం జగన్ ఒకటి తలిస్తే.. దైవం ఒకటి తలుస్తుంది అన్నట్టు వ్యవహారం మారింది. గత కొన్నాళ్లుగా రాజకీయంగా జగన్ అనుకుంటున్నది ఏదీ జరగడం లేదు. రెండేళ్లుగా టీడీపీ, జనసేన పొత్తు కుదరకూడదని చాలా ప్రయత్నాలు చేశారు. జనసేన కార్యకర్తలను, నాయకులను రెచ్చగొట్టారు. కాపులను పవన్ టీడీపీకి తాకట్టు పెడతారని అన్నారు. చంద్రబాబు జనసేనకు 20 స్థానాలు విసిరేస్తారని సెటైర్లు వేశారు. అలా జనసేన, టీడీపీ మధ్య గొడవలు పెట్టడానికి ప్రయత్నించారు. కానీ, అది వర్క్ అవుట్ కాలేదు. వైసీపీ ఓడిపోవాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంక్ చీలకూడాదని పవన్ పదే పది చెబుతూ వచ్చారు. అందుకే ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోవద్దని పవన్ జనసేన కార్యకర్తలకు చెబుతూ వచ్చారు. చివరికి జగన్ ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. టీడీపీ, జనసే పొత్తు ఖరారు అయింది. మెజారిటీ స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన కూడా పూర్తి అయింది. ప్రకటించేశారు కూడా. ఇక.. జనసేన, టీడీపీతో బీజేపీ అయినా కలవకుండా ఉంచడానికి తీవ్రం ప్రయత్నించారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అమిత్ షా, నడ్డాను కలిసిన తర్వాత వెంటనే జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలిశారు. బీజేపీకి అన్ని రకాలుగా సహకారిస్తానని హామీ ఇచ్చారు. కానీ.. ఆ పప్పులు కూడా ఉడకలేదు. బీజేపీతో టీడీపీ, జనసేన పొత్తు ఖాయమైంది. ఇప్పటి వరకూ ప్రతిపక్షాల మధ్య గొడవలు పెట్టడానికి చూసిన జగన్ తన కార్యక్రమాలపై దృష్టి పెట్టారు.

సిద్దం చివరి సభను గ్రాండ్ గా నిర్వహించాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ.. ఆ ప్రయత్నాలు కూడా ఫలించడం లేదు. ఇప్పుటి వరకూ మూడు సభలను ఏర్పాటు చేశారు. ఆ సభలకు వస్తున్నా జనం మాట అటుంచితే.. సభలను నిర్వహించడానికి వైసీపీ నేతల కష్టాలు మామూలుగా లేవు. అందుకే.. ఒక్కో సభను మూడు, నాలుగు సార్లు వాయిదా వేస్తున్నారు. వెంటవెంటే జనసమీకరణ అంటే కష్టం అవుతోంది. ఎదో కష్టపడి మూడు సభలను నిర్వహించారు. ఇప్పుడు నాలుగో సభ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో ఈ సభను నిర్వహించనున్నారు. ఈ సభను గత నెలలోనే నిర్వహించాల్సి ఉంది. కానీ, పదేపది వాయిదాలు వేస్తూ వచ్చారు. చివరి ఇవాళ జరగాల్సి ఉండగా మరోసారి వాయిదా వేశారు. ఈ నెల 19కి దాన్ని మార్చినట్టు తెలుస్తోంది.

దానికి ప్రధాన కారణం టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు అని తెలుస్తోంది. పొత్తు ఖాయం కావడంతో మరింతగా జనసమీకరణకు ప్రయత్నిస్తున్నారు. ఆ పొత్తు ఎఫెక్ట్ ప్రజల్లో లేదని చెప్పాలని జగన్ చూస్తున్నారు. అందుకే 15 లక్షల మందితో ఈ సభను నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ బాధ్యతలను ఎంపీ విజయసాయిరెడ్డిపై వేశారు. విజయసాయిరెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసిన జనసమీకరణ తలకు మించిన భారం అవుతోంది. అటు, సభ వాయిదా వేయడానికి మరో కారణం కూడా ఉంది. ఈ సభలో కీలక ప్రకటనలు చేయాలని భావిస్తున్నారు. ప్రభుత్వ మీటింగ్ అయినా.. పార్టీ మీటింగ్ అయినా.. ఎన్నికల సభలోనైనా జగన్ స్పీచ్ లో తేడా ఏం ఉంటడం లేదు. ప్రతీ మీటింగులోనూ చంద్రబాబు, పవన్, లోకేష్ ను తిట్టడమే పని. దాంతో మాకొచ్చేదేంటి అని జనం అనుకునే పరిస్థితి. గత మూడు సిద్దం సభలను కూడా ఇదే తరహా ప్రసంగాలతో మమ అనిపించారు. కానీ, ఎన్నికల సభలో జగన్ ఏమైనా ప్రకటిస్తారా? కొత్త పథకాలు అనౌన్స్ చేస్తారా? అని చాలా మంది అనుకున్నారు. రాప్తాడు సభలోనే రుణమాఫీలాంటి ప్రకటన ఉంటుందని చాలా మంది భావించారు. కానీ, అలాంటిదేమీ లేదు. దీంతో ఓటర్లే కాదు.. పార్టీ శ్రేణులు కూడా నిరుత్సాహ పడ్డారు. దీంతో.. చివరి సభలో కీలక రుణమాఫీ గురించి ప్రకటన చేయాలని భావిస్తున్నారు. ప్రకటనకు పరిమితం అయితే.. జనం నమ్మే పరిస్థితుల్లో లేరని జగన్‌కు కూడా తెలుసు. అందుకే.. ప్రకటన చేసి కొంతమేర రుణాలు మాఫీ చేయాలని అనుకుంటున్నారు. ఆ మాత్రం ధైర్యం చేయకపోతే.. టీడీపీ, జనసేన, బీజేపీని ఎదుర్కోవడం సాధ్యం కాదనే అంచనాకు జగన్ వచ్చారు. రుణాలు కొంతమేరా మాఫీ చేయాలన్నా.. కనీసం 20 వేల కోట్లు ఉండాలి. దానికి ప్రధాని దగ్గరకు వెళ్లి అప్పు తీసుకోవాలని సీఎం ఆలోచన. కానీ, ప్రధాని ఫుల్ బిజీ అయిపోయారు. ఆయన అపాయింట్మెంట్ కూడా దొరకడం లేదు. కేంద్రం నుంచి అప్పులకు పర్మిషన్ వచ్చిన తర్వాత సిద్దం సభను ఏర్పాటు చేసి ఆ సభలో రుణమాఫీ ప్రకటన చేయాలని అనుకుంటున్నారు. అందుకే ఆ సభను వాయిదా వేస్తూ వస్తున్నారు. బీజేపీతో జనసేన, టీడీపీ పొత్తు ఖాయం అయ్యే సరికి జగన్ వెన్నులో వణుకు మొదలైంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -