YS Jagan: సొంత ఇలాకాలోనే జగన్ కు మైండ్ బ్లాంక్ అయ్యే షాక్.. వందల బస్సులు పెట్టి తరలించినా జనం లేరుగా!

YS Jagan: మనుషులు లేకపోయినా అభివాదం చేయడం.. కష్టంలో ఉన్నవారి దగ్గరకు వెళ్లి అక్కడ కూడా మనస్పూర్తిగా నవ్వడం ఏపీ సీఎం జగన్‌లోనే చూడొచ్చు. ఈ మధ్య ఓ రీల్ బాగా గ్రెండ్ అయింది. మా అమ్మ జాబ్ పోయిందని ఓ చిన్నారి ఏడుస్తూ సీఎం జగన్‌కు చెబుతుంది. ఏంటమ్మా జాబ్ పోయిందా? అని తిరిగి ప్రశ్నించి నవ్వుతాడు. మరో ఘటనలో శవాన్ని చూస్తూ చిక్కడి చిరునవ్వులు చిందిస్తున్న ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఎందుకు ఆయన ఇలా వ్యహరిస్తున్నారనే చర్చ నడుస్తోంది. అయితే, రాజకీయ నాయకులకు సలహాలు ఇచ్చే వాళ్లు చాలా మంది ఉంటారు. ప్రజల్లోకి వెళ్లినపుడు ఎలా ఉండాలి? ఏం చేయాలని సలహాలు ఇస్తారు. గతసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహ కర్తగా పని చేశారు. అప్పుడు కేజ్రీవాల్ కు ఓ సలహా ఇచ్చారట. మీరు పబ్లిక్ మీటింగుల్లో సీరియస్ గా మాట్లాడకుండా అప్పుడప్పుడు మధ్యలో చమత్కరించాలి. ప్రజలను చూస్తూ నవ్వాలి. పలకరించాలి. అభివాదం చేయాలి. ఇలా ప్రజలతో మమేకం అవ్వాలని చెప్పారట. ఇలాగే జగన్ కు కూడా ఎవరో సలహా ఇచ్చి ఉంటారు. ప్రజలను నవ్వుతూ పలకరించండి అని. అయితే, నవ్వమన్నారు కదా అని ఎక్కడి పడతే అక్కడ నవ్వేస్తూ.. నవ్వుల పాలు అవుతున్నారు. శవం దగ్గర, ఆస్పత్రిలో, కష్టంలో ఉన్నవాళ్ల దగ్గర.. ఇలా ఎక్కడికి వెళ్లిన చిక్కడి చిరునవ్వులు చిందిస్తున్నారు.

ఇలా నవ్వుల గురించి సలహా ఇచ్చినట్టే.. ప్రజలు లేకపోయినా అభివాదం చేయాలని సలహా ఇచ్చినట్టు ఉన్నారు. అందుకే.. దాన్ని కూడా బాగా ఫాలో అవుతున్నారు. నాలుగు సిద్దం సభలు నిర్వహించిన తర్వాత ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికలకు ఇంకా చాలా రోజులు టైం ఉంది. దీంతో.. ఏం చేయాలో తెలియక.. మేమంతా సిద్ధం అంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. సిద్దం సభలకు ప్రజలను తరలించే వారు. ఇప్పుడు ప్రజలు దగ్గరకు వెళ్తున్నారు. కానీ.. అక్కడ ప్రజలు ఉండటం లేదు. అందుకే ప్రజలు ఉన్నా.. లేకపోయినా.. చేతులు ఊపుకుంటూ పోతున్నారు. అయితే.. అమరావతి ప్రాంతంలో ప్రజలు లేరంటే ఓ అర్థం ఉంది. కానీ, ఆయన ఇడుపులపాయ నుంచి యాత్రను మొదలు పెట్టారు. అంటే తన ఇలాకాలోనే మేమంతా సిద్ధం యత్రకు ప్రజలు రాలేదు. బస్సులో జగన్ బస్సు చుట్టూ భద్రతా సిబ్బంది ఉన్నారు.

ఎప్పటి లాగే జమ్మలమడుగులోని యర్రగుంట్ల లాంటి సర్కిల్స్ దగ్గర జనాన్ని పోగేసి డ్రోన్ షాట్లను తీశారు. అక్కడ మాత్రం జగన్ బస్సు టాప్ ఎక్కి జననానికి అభివాదం చేశారు. ప్రొద్దుటూరు సభకు రాయలసీమలో ఉమ్మడి నాలుగు జిల్లాల నుంచి జనాన్ని తరలించడానికి బస్సులు పెట్టారు. అయితే వైసీపీ నేతలు ఎంత ప్రయత్నించినా జనం రాలేదు. వచ్చిన వాళ్లు కూడా జగన్ సభ మొదలు కావడానికి ముందే జంప్ అయిపోయారు. హడావుడిగా ఏర్పాటు చేసి సభా ప్రాంగాణం మొత్తం ఖాళీగా కనిపించింది. ఇప్పటికే సిద్దం సభలో గ్రాఫిక్స్ తో మేనేజ్ చేసి నవ్వుల పాలు అయ్యారు. దీంతో.. ఇప్పుడు అలాంటి సహసం చేయలేదు. కానీ.. మేమంతా సిద్దం సభలు చూస్తున్నవారికి ఇప్పుడు నిజం బోదపడుతోంది. సిద్దం సభలకు నిజంగా జనం రాలేదని.. గ్రాఫిక్స్ తో మేనేజ్ చేశారని అర్థం అవుతోంది.

జగన్ సభలకు జనం రావడంలేదని.. సిద్దం సభలో మేనేజ్ చేసిన గ్రాఫిక్స్ చూసిన తర్వాతే తెలిసిపోయింది. కానీ, జగన్ సొంత ఇలాకాలో కూడా స్థానిక నేతలు ప్రజలను తరలించలేకపోయారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు.. రాయలసీమలోనే ఇంత దారణంగా ఉంటే.. ముందుముందు రాష్ట్రం మొత్తం మీద యాత్రను ఎలా చేస్తారో అనే అనుమానం కలుగుతోంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: జగన్ మేనిఫెస్టో మోసాలు.. శవాల మీద పేలాలు ఏరుకునేలా రాజకీయాలు చేశారా?

CM Jagan:  జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో తనకు బైబిల్ ఖురాన్ భగవద్గీత లాంటిది అని చెబుతూ ఉంటారు అయితే ఎన్నికలలో భాగంగా మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఎన్నో పథకాలను అమలు పరచలేదు అయితే ఇలాంటి...
- Advertisement -
- Advertisement -