YS Jagan: ఉత్తరాంధ్ర ప్రజల జీవితాలతో జగన్ ఆటలు.. ప్రజలను నమ్మించి ఇంతలా మోసం చేశారా?

YS Jagan: వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసిన పాలనలో ఎక్కడ అభివృద్ధి కనిపించలేదని తెలుస్తుంది. ఈయన పాలనలో సంక్షేమ పథకాలను అందించడం కోసం పెద్ద ఎత్తున డబ్బులు బదిలీ చేస్తున్నారే తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన దాఖలాలు లేవు ముఖ్యంగా వెనుకబడినటువంటి ఉత్తరాంధ్ర ప్రజల జీవితాలతో జగన్మోహన్ రెడ్డి ఆటలాడారని తెలుస్తోంది.

ఎన్నికల ముందు ఉత్తరాంధ్రలోని నీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కేవలం సంవత్సరం వ్యవధిలోగా ఈ వంశధార నాగావళి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని జగన్మోహన్ రెడ్డి ప్రగల్బాలు పలికారు అయితే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారని చెప్పాలి.

ఎన్నికల ముందు ఈయన ఇచ్చిన హామీలను ఒకటి కూడా నెరవేర్చలేకపోయారు. గతంలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన ప్రాజెక్టులన్నింటికీ కలిపి 3,228.52 కోట్ల రూపాయలు కేటాయించాల్సి ఉండగా గత ఐదేళ్ల పాలనలో 594.74 కోట్లు మాత్రమే కేటాయించారు. దీంతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టులు అన్నీ కూడా అలాగే ఉండిపోయాయి.

ఇలా ఉత్తరాంధ్ర ప్రజలను జగన్మోహన్ రెడ్డి నమ్మించి మోసం చేశారని వారి జీవితాలతో ఆటలు ఆడాలని తెలుస్తుంది. ఏంతో వెనుకబడి ఉన్నటువంటి ఈ జిల్లాలలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేస్తే రైతులు భూమిని సాగు చేయడానికి అనువుగా ఉంటుంది ఇలాంటి తరుణంలో ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణ పనులను గాలికి వదిలేయడంతో ప్రజల పరిస్థితి ఎంతో దయనీయంగా ఉందని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -