CM YS Jagan Mohan Reddy: రానున్న ఎన్నికలో వారికే టికెట్‌:జగన్‌

CM YS Jagan Mohan Reddy:  రాజకీయంలో ఎప్పుడు ఎవరికి టికెట్‌ వస్తోందో.. ఎప్పుడు ఎవరి పదవి ఊడిపోతోందో ఎవరూ అంచన వేయలేరు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల పనితీరు, వారికి ప్రజల్లో ఉన్న ఆదరణ, మళ్లీ ఎన్నికల్లో వీరికి టికెట్‌ ఇస్తే గెలుస్తారో లేదా అనే సర్వేలు చేపడుతోంది అధిష్టానం. ఒకవేళ అలాంటి సర్వేలో సంబంధిత వ్యక్తులకు ప్రజాదరణ లేకపోతే వారిని మార్చి ఇతర వ్యక్తులకు టికెట్‌ ఇచ్చి పార్టీని గెలిపించేందుకు ప్లాన్‌ను చేస్తుంటారు. ఇదే తీరును ఇప్పుడు ఆంద్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అనుసరిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో ఎవరిని తప్పించాలి.. ఎవరికి టికెట్‌ ఇస్తే మళ్లీ అధికారంలోకి వస్తాం అనే సర్కేలను ప్రారంభించారు.

ఆయన సర్వేలో వెల్లడైన విషయమేమిటంటే దాదాప 60 ఎమ్మెల్యేలు, 12 మంది ఎంపీలు మరోసారి టికెట్‌ అందుకోలేపోతున్నట్లు సమాచారం. ఆ ఎంపీల్లో ఎక్కువ శాతం మందికి ఎమ్మెల్యే టికెట్లు ఆఫర్‌ చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉండగా డొక్క మాణిక్‌ ప్రసాద్‌ను అక్కడ అదనపు సమన్వయ కర్తగా జగన్‌ నియమించారు. తాను ఉండగా మరొకరిని ఎలా నియమిస్తారని అక్కడి ఎమ్మెల్యే అసంతృప్తిలో ఉండగా జగన్‌ మాత్రం తాను అనుకున్నాది పక్కా ప్రణాళికలతో అమలు చేస్తున్నారు. ఇక్కడి ఎమ్మెల్యేపై తీవ్ర వ్యతిరేకత ఉండటంతో ఈ చర్యలు తీసుకుంటున్న పార్టీ ఈధికార వర్గాల పేర్కొంటున్నాయి. అసంతృప్తిలో ఉన్నా కూడా కఠినంగానే ఉంటామని ఇప్పటికే గ్రీన్‌ సిగ్నల్‌ అందడంతో చేసేది లేక అక్కడి ఎమ్మెల్యే మౌనంగా ఉండిపోయారు.

సమన్వయకర్తలను కూడా.. సర్వేల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా 30 నియోజకవర్గాలో çకొత్త సమన్వయ కర్తలను నియమించబోతున్నట్లు సమాచారం. సమన్వయకర్తలను నియమించే నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. మరో 30 మంది ఎమ్మెల్యేల పరిస్థితి బ్యాలెసింగ్‌ ఉన్నా వారికి మరోమార్గం వెతికితే తేడా వస్తుందని భావించి రెండవ లీడర్‌షిప్‌ను రంగంలోకి దింపినట్లు తీసుకురావాలనే ఆలోచనలు కొసాగుతున్నట్లు తెలిసింది. రానున్న రోజుల్లోనూ మరికొన్ని నయోజకవర్గాల్లో మార్పులు చేర్పులు, అదనపు ఇన్‌చార్జుల నియామకాలు కూడా చేపట్టే యోచనలో పార్టీ అధిష్ఠానం పావులు కదుపుతోంది. అధిష్ఠానం నిర్ణయంతో ఎవరి సీటుకు ఎప్పుడు ఎసరు పడుతోందోనిని ఆయా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

ఐప్యాక్, ఢిల్లీకి చెందిన మరో సంస్థతో జగన్‌ 175 నియోజకవర్గాల్లో సర్వేలు చేయించారు. సర్వేలను ఆధారంగా 58 అసెంబ్లీ స్థానాలు, 12 మంది ఎంపీల మార్పులు ఉండచ్చనే మాటలు వినిపిస్తున్నాయి. ఇందులో కొందరు ఎమ్మెల్యేను పోటీలకు దింపడం, కొందరు ఎంపీలను ఎమ్మెల్యేలుగా రంగంలోకి దింపనున్నట్లు సమాచారం.సర్వే ప్రకారం జగన్‌ తీసుకున్న నిర్ణయాల్లో మంత్రుల నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. గుంటూరు, ప్రకాశం జిల్లాల మంత్రులకు కూడా ఎసరు పెట్టే అవకాశం కన్పిస్తోంది. దాదాపుగా 6 మంది మంత్రులకు టికెట్‌ హోంఫట్‌ అయ్యేట్లు ప్రచారం జరగుతోంది. 12 ఎంపీ స్థానాల్లో పార్టీ ఎంపీలు, ఇన్‌చార్జులు కూడా మారనున్నారు.అందులో హిందూపురం అనంతపురం, బాపట్ల, విజయవాడ, నెల్లూరు, మలాపురం,నర్సాపురం, ఏలూరు అనకాపల్లి, విశాఖ, విజయనగరం శ్రీకాకుళం జిల్లాలు ఉండటంతో ఆయా ఎంపీలు, ఎమ్మెల్యేలు సందిగ్ధంలో పడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Raghurama Krishnam Raju: రఘురామ కృష్ణంరాజు కల నెరవేరిందిగా.. ఉండి ఎమ్మెల్యేగా ఆయన విజయం పక్కా!

Raghurama Krishnam Raju: ప్రస్తుత నరసాపురం సిట్టింగ్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి నర్సాపురం ఎంపీగా గెలుపొందారు. ఇలా గెలిచిన కొద్ది రోజులకే పార్టీ పిఠాయించి తెలుగుదేశం చెంతకు చేరారు....
- Advertisement -
- Advertisement -