YS Jagan: అప్పు దొరకని పక్షంలో జగన్ రెడ్డి జీతాలు కూడా ఇవ్వలేడా.. ఎన్నికల ముందు ఘోరమైన పరిస్థితి అంటూ?

YS Jagan: ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ధిక క్రమశిక్షణ అనేది బొత్తిగా లేకుండా పోయింది. అప్పులు చేయడం ప్రతీ రాష్ట్రంలో కూడా సహజమే. అయితే, అందులో ఎంతమేర పెట్టబడుల రూపంలో పెడుతున్నారు అనేది కీలకం. కానీ, వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న అప్పులు మొత్తం బటన్లు నొక్కడానికి, జీతాలే పోతుంది తప్ప పెట్టుబడుల రూపంలో కనిపించడం లేదు. దీంతో ఇప్పుడు అదనంగా అప్పులు పుట్టే అవకాశం కనిపించడం లేదు. ఎన్నికల ముందు వైసీపీ నానా పాట్లు పడక తప్పని పరిస్థితి ఏర్పడింది. వచ్చే నెల కనీసం ఉద్యోగులకు జీతాలైనా ఇస్తారా? ఇవ్వరా అన్న పరిస్థితి ఏర్పడింది.

జగన్ సర్కార్ ఆర్బీఐ దగ్గర వేస్ అండ్ మీన్స్ వాడుకున్నారు. ఓవర్ డ్రాప్ట్ లోకి వెళ్లిపోయారు. మరో వైపు కొద్దో గొప్పో ఉన్న నిధులను కావాల్సిన కాంట్రాక్టర్లకు చెల్లించేశారు. దీంతో.. ఇకపై నొక్కాల్సిన బటన్ల విషయంలో జగన్ తర్జనభర్జన పడుతున్నారు. ఇప్పటికే చాలా బటన్లు పెండింగ్‌లో ఉన్నాయి. నొక్కిన బటన్లు పని చేయాలంటే కేంద్రమే ఇప్పుడు జగన్ ప్రభుత్వాన్ని ఆదుకోవాలి. ఎందుకంటే ఆర్బీఐ దగ్గర అప్పు దొరికే పరిస్థితి లేదు. కేరళ ప్రభుత్వానికి 20 వేల కోట్ల రూపాయల అప్పు ఇవ్వడానికే ఆర్బీఐ నిబందనలు పెట్టి అప్పులు పుట్టనీయడం లేదు. నిజానికి కేరళ ప్రభుత్వం చాలా ఆర్థిక క్రమశిక్షణ గల రాష్ట్రం మరి కేరళ పరిస్థితి అలా ఉంటే ఏపీ పరిస్థితి ఎలా ఉండాలి. కానీ, ఇప్పటి వరకూ ఏపీ ప్రభుత్వానికి ఆర్బీఐ ద్వారానే 70 వేల కోట్ల అప్పులు లభించాయి. ఈ ఆర్ధిక సంవత్సరానికి 45 వేల కోట్ల రూపాయలు మాత్రమే అప్పు తీసుకునేందుకు అనుమతి ఉంది.

కానీ, అనుమతి ఉన్నంత మేర అప్పును జగన్ ప్రభుత్వం ఆరు నెలల్లోనే వాడేసింది. ఇప్పుడు ఆర్బీఐ ద్వారా అప్పు లభించాలంటే కష్టం. కేంద్రం ఇస్తే ఏదోలా నెట్టుకొద్దామని జగన్ అనుకుంటున్నారు. కానీ, ఇప్పుడు కేంద్రం ఎంతవరకు సహకరిస్తుందో చెప్పలేం. ఎందుకంటే.. ఇప్పుడు బీజేపీ ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకుంటుంది. అప్పుల విషయంలో రూల్స్, నిబందనలను అతిక్రమించినా.. కేంద్రం ఇంత వరకూ చూస్తూ చూడనట్టు వ్యవహరించింది. కానీ, ఇప్పుడు ఏపీలో ప్రతిపక్ష కూటమిలో ఉంది కనుక నిబందనలను తెరపైకి తీసుకొచ్చే అవకాశం ఉంది. దీంతో కేంద్రం జగన్ కు ఎంత మేర సహకరిస్తుందో చెప్పలేం.

ఒకవేళ కేంద్ర సాయం లేకపోతే మాత్రం వచ్చే నెల జీతాలు పడటం కూడా కష్టమే. ఆ తర్వాత ఇప్పటి నొక్కాల్సిన బటన్లు పెండింగ్‌లో చాలానే ఉన్నాయి. వాటిని నొక్కాలి అంటే కేంద్రం ఓ చూపు చూడాలి. లేదంటే అవన్ని ఎన్నికల లోపు నొక్కకపోతే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదు. అదే జరిగితే ఇక జగన్ సర్కార్ సంగతి అంతే. పైగా ఎన్నికలకు కూడా ఎక్కువ సమయం లేదు. ఎలక్షన్ కోడ్ 10 రోజుల్లోపే అమలులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే నిధులు అందినప్పటికీ.. బటన్లు నొక్కడానికి చాలా సమస్యలు ఎదురవుతాయి. ఇప్పటి వరకూ నొక్కిన బటన్లు పని చేయలేదో ఏమో కానీ.. డబ్బులు మాత్రం లబ్ధి దారుల అకౌంట్లలోకి పడలేదు. ఆసరా బటన్ నొక్కి చాలా కాలం అయింది. కానీ, సగం మందికి కూడా డబ్బులు జమ కాలేదు.

ఇక ఫీజు రిఎంబర్స్‌మెంట్ బటన్ నొక్కుతానంటూ పాముర్రలో ఏర్పాట్లు చేశారు. కానీ, రెండు రోజులు వాయిదా వేశారు. నిధులు లేకపోవడంతోనే వాయిదా పడిందని తెలుస్తోంది. బటన్ నొక్కిన తర్వాత కొంతమందికి అయినా మొదట పడితే మిగిలిన వారికి ఏదోలా నచ్చచెప్పొచ్చని వైసీపీ నేతల ఆలోచన. కానీ, కొంతమంది కోసమైనా నిధులు అందుబాటులో లేనట్టు తెలుస్తోంది. ఇప్పుడు కేంద్రమే ఆపద్భాందువుడు పాత్ర పోషించకపోతే… ఎన్నికలకు ముందే వైసీపీ నేతలు చేతులెత్తేయాల్సిందేనని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -