CM Jagan: కొత్త నాటకంతో ప్రజల ముందుకు వస్తున్న సీఎం జగన్.. జాగ్రత్త పడకపోతే నష్టమంటూ?

CM Jagan: ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి సరికొత్త నాటకానికి తెర తీశారు. ఈయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మూడు సంవత్సరాల తర్వాత ఇంకా రాజధానిని ఎప్పుడు నిర్మిస్తారు అంటూ అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే అధునాతన భవనాలను నిర్మించి రాజధానిని పూర్తిగా అభివృద్ధి చేస్తామని ప్రగల్బాలు పలికారు.

ఇక జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధి ఏది లేదనే చెప్పాలి అమరావతిలో చంద్రబాబు నాయుడు కట్టినటువంటి భవనాలను కూడా కూల్చివేసి అభివృద్ధికి అడ్డు వేశారు అంతేకాకుండా విశాఖపట్నంలో రాజధానిగా ప్రకటించారు. విశాఖ నుంచి పరిపాలన కొనసాగుతుందని తాను కూడా విశాఖలోనే ఉండబోతున్నానని చెప్పారు. సంక్రాంతికి వస్తున్నానని ఉగాదికి వస్తున్నానంటూ పలుమార్లు మాట మార్చి మాట తప్పారు.

ఇకపోతే తాజగా విశాఖలో జరిగినటువంటి సదస్సులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖ గురించి మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పూర్తయిన తర్వాత తాను విశాఖలోనే ఉండబోతున్నానని ఇక్కడే తన ప్రమాణ స్వీకారం కూడా ఉంటుందని ఈయన మాట్లాడారు.

బహుశా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ కలలోనే ఉన్నారని వచ్చే ఎన్నికలలో తాను గెలుస్తాను ప్రమాణస్వీకారం కూడా చేస్తానని ఈయన పగటి కలలు కంటున్నారని స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికే ఎన్నో సర్వేలు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓటమి ఎదుర్కోవాల్సి ఉంటుంది అని తేల్చి చెప్పాలి అయినప్పటికీ ఈయన విశాఖ ప్రజలపై ప్రేమ ఉన్నట్లు వాళ్లు అభివృద్ధి చేయలేదని ఎక్కడ ప్రశ్నిస్తారోనని తన ప్రమాణ స్వీకారం విశాఖలోనే ఉండబోతుంది అంటూ సరికొత్త నాటకాలకు తెర లేపారని స్పష్టంగా అర్థమవుతుంది.

Related Articles

ట్రేండింగ్

Election Campaigns: ఎన్నికల వేళ గరిష్టంగా రోజుకు 5,000 రూపాయలు.. కూలీలకు పంట పండుతోందా?

Election Campaigns: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారం చూస్తుంటే ఇవి అత్యంత ఖరీదైనవి గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఎన్నికల సమయంలో పార్టీ నాయకుల మీద అభిమానంతో స్వచ్ఛందంగా జనాలు...
- Advertisement -
- Advertisement -