YS Jagan: వై నాట్ 200 అంటున్న సీఎం జగన్.. వై నాట్ 20 అంటున్న ఏపీ ప్రజలు!

YS Jagan: ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే ఇడుపులపాయలో ప్రారంభం అయినటువంటి ఈ బస్సు యాత్ర ఇచ్చాపురం వరకు కొనసాగుతుంది. ఇక ఈ బస్సు యాత్రలో భాగంగా పెద్ద ఎత్తున ఈయన బహిరంగ సభలను కూడా ఏర్పాటు చేస్తున్నారు.

గత ఎన్నికలలో 151 స్థానాలలో గెలుపొందినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈసారి మాత్రం తన అభివృద్ధి చూసి 175 స్థానాలలో గెలుపొందాలి అంటూ పెద్ద ఎత్తున ప్రసంగాలు ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే వై నాట్ 175 అనే శ్లోగాన్ తో ఇన్ని రోజులు ప్రచారాలు మొదలుపెట్టారు కానీ గత రెండు రోజుల నుంచి చూస్తుంటే ఈయన వై నాట్ 200 అంటూ సరికొత్త రాగం పాడుతున్నారు. అదేంటి మన ఆంధ్రప్రదేశ్లో 175 స్థానాలు కదా ఉండేది అంటే మరో 25 లోక్ సభ స్థానాలను కూడా కలుపుకొని జగన్మోహన్ రెడ్డి 200 స్థానాలలో తమ పార్టీ జెండా ఎగరబోతుందంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈయన బస్సు యాత్రకు గ్రౌండ్ లెవెల్ లో వస్తున్నటువంటి ఆదరణ చూసి బహుశా ఇలా అనుకుంటున్నారేమో కానీ ప్రజలు మాత్రం ఈసారి తమ ఓట్ల ద్వారా బుద్ధి వచ్చేలా చెబుతామంటూ సిద్ధమయ్యారు. జగన్మోహన్ రెడ్డి వై నాట్ 200 అని చెబుతూ ఉండగా ప్రజలు మాత్రం వై నాట్ 20 అంటూ సమాధానం చెప్పడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.

ఇక మరోవైపు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మోడీ ఈ ముగ్గురు కూడా కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి దిగబోతున్న సంగతి తెలిసిందే .ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు ఒకవైపు పవన్ కళ్యాణ్ మరోవైపు ప్రచార కార్యక్రమాలను కూడా మొదలుపెట్టేశారు. అయితే ఈ కూటమికి భారీ స్థాయిలో స్పందన వస్తున్నటువంటి తరుణంలో ఈసారి తప్పకుండా కూటమే అధికారంలోకి రాబోతుందని కూడా తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -