YS Sharmila: షర్మిల రాజకీయాలకు బెదురుతున్న సీఎం జగన్.. కడపలో కూడా షాకులు తప్పవా?

YS Sharmila:  ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తన రాజకీయ డోస్ పెంచారు. ఈమె కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న తర్వాత తన అన్నయ్య జగన్మోహన్ రెడ్డి పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆయన గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారు అంటూ ప్రశ్నిస్తూ వచ్చారు.. ఇకపోతే ఇటీవల జగన్మోహన్ రెడ్డి పసుపు చీర కట్టుకొని శత్రువుల వద్ద మోకారిల్లారు అంటూ షర్మిలపై చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపాయి.

ఈ వ్యాఖ్యలకు షర్మిల మరుసటరోజే తన అన్నయ్యకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇలా జగన్మోహన్ రెడ్డి పట్ల షర్మిల చేసిన ఈ వ్యాఖ్యలపై ఏపీ సర్కార తన పట్ల కక్షపూరిత చర్యలకు పాల్పడ్డారని తెలుస్తుంది. ఇటీవల షర్మిల దెందులూరు సభ నిర్వహించిన సంగతి తెలిసిందే ఈ సభ పూర్తి కాగానే పోలీసులు కూడా అక్కడ నుంచి వెళ్లిపోవడంతో తీవ్రమైనటువంటి ట్రాఫిక్ ఏర్పడింది.

ఈ ట్రాఫిక్ లో షర్మిల దాదాపు గంట పాటు వెయిట్ చేయాల్సి వచ్చిందని ట్రాఫిక్ క్లియర్ చేయడానికి పోలీసులు కూడా లేకపోవడంతో ఆమె స్వయంగా ఎస్పీకి ఫోన్ చేసిన లిఫ్ట్ చేయని పరిస్థితులలో ఏపీ సర్కార్ ఉందని తెలిపారు. అయితే తన అన్నయ్య జగన్మోహన్ రెడ్డి పట్ల ఈమె చేసిన వ్యాఖ్యల కారణంగానే ఇలా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని ఆరోపణలు చేశారు.

సొంత చెల్లిపై కూడా జగన్ రెడ్డి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని.. వై నాట్ 175అంటూ బీరాలు పలుకుతోన్న జగన్ షర్మిల రాజకీయానికి ఎందుకు బెదురుతున్నారని ప్రశ్నిస్తున్నారు. షర్మిలను అడ్డుకునేలా ఇలాంటి చిల్లర పనులు మానుకోవాలని వైసీపీ సర్కారుకు సూచనలు చేస్తున్నారు. షర్మిల స్పీడ్ చూస్తుంటే ఈమె రాజకీయ దెబ్బకు జగన్మోహన్ రెడ్డి కడపలో కూడా త్వరలోనే గట్టి షాక్ ఎదుర్కోబోతున్నారని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -