Sharmila: అన్ని మెట్లు దిగేసిన వైఎస్ షర్మిల.. ఆ పార్టీలో తన పార్టీని విలీనం చేయడమే మిగిలిందా?

Sharmila: వైయస్ రాజశేఖర్ రెడ్డి బట్టి ఒక గొప్ప నాయకుడికి కూతురిగా జన్మించినటువంటి షర్మిల తన రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారా అంటే అవునని సమాధానాలు వినపడుతున్నాయి. వైయస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించినటువంటి వైఎస్ఆర్ షర్మిల రాష్ట్రంలో పలు ప్రాంతాలలో పర్యటిస్తూ అధికార పక్షంపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. ఈ విధంగా ఈమె పాదయాత్రకు అడ్డుకట్టు వేసి పోలీసులు ఎన్నో ఆంక్షలు విధించారు.

ఇక రాజన్న వారసురాలిగా ఎన్నికల బరిలో దిగబోతున్నటువంటి ఈమె ఒక్కసారైనా స్వయంగా ఎన్నికల బరిలో గెలుస్తుందా అంటే కష్టమేనని సమాధానాలువినపడుతున్నాయి తన తండ్రి మరణం తర్వాత తన అన్నయ్యను జైలు పాలు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంతో ఈమె చేయి కలపడడానికి సిద్ధమవుతున్నారన్న వార్త వైరల్ అవుతున్నాయి.

 

గత కొంతకాలంగా కాంగ్రెస్ అధిష్టానం షర్మిలతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వైఎస్ఆర్సిపి పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని ఆమెకు పలు ఆఫర్లను కూడా ప్రకటించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం షర్మిల రాజకీయ ప్రస్థానం కనుక చూస్తే షర్మిల సొంత పార్టీకి ఇక తెరపడినట్టేనని పలువురు భావిస్తున్నారు. ఎంతో సంచలనం కాగలదని అనిపించిన షర్మిల.. రాజకీయంగా రాజీపడడంలో ఇక అన్ని మెట్లూ దిగేసినట్లేనని, సొంత ప్రస్థానానికి ఎండ్ కార్డ్ ఒక్కటే మిగిలి ఉందని తెలుస్తుంది.

 

ఇలా వైయస్ షర్మిల దాదాపు తన పార్టీని కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేయడానికి సిద్ధమయ్యారని ఇక ప్రకటన మాత్రమే మిగిలి ఉందని తెలుస్తుంది అయితే ఈ ప్రకటన కూడా రేపో మాపో తెలియజేసే సందర్భాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఒకవేళ ఈమె కాంగ్రెస్ పార్టీలోకి కనక చేరితే సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సిద్ధమైందని తెలుస్తుంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -