YS Sunitha: గీత దాటుతున్న వైస్ సునీత.. ఆ తప్పులు చేస్తే ఇక అంతేనా?

YS Sunitha: వైఎస్ సునీత ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. సునీత కొత్త కొత్త కోణాల్లో కోర్టులో పిటిషన్లు వేయడంలో ఆరితేరిపోయిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే తాజాగా మరో విచిత్రమైన వాదనతో కోర్టులో మెమో దాఖలు చేసింది. సునీతారెడ్డి అంటే వైఎస్ వివేకానందరెడ్డి కూతురు. తన తండ్రి హత్యకు గురయ్యాడనే ఆరోపణలతో నిందితులను తెల్చాలి అంటూ ఆమె న్యాయపోరాటం చేస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా తాజాగా సునీత హైకోర్టులో దాఖలు చేసిన మెమో ఆమె ఆశించే ప్రయోజనాల గురించి అనుమానాలు కలిగించేలా ఉంది.

వైఎస్ అవినాష్ రెడ్డిని హత్యకు సూత్రధారిగా రంగుపులిమి శిక్ష పడేలా చేయడానికి సునీత రెడ్డి ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. సీబీఐ విచారణకు హాజరవుతున్న క్రమంలో, ఇటీవలి అవినాష్ తల్లి గుండెపోటుకు గురికావడం, ఆమెను కొన్ని రోజుల పాటు ఆస్పత్రిలో ఉంచడం జరిగింది. తల్లికి చికిత్స జరుగుతున్న కారణంగా కొన్ని రోజులు విచారణ నుంచి మినహాయింపు కావాలని కూడా అవినాష్ అడగడం జరిగింది. కాగా సునీత తాజాగా దాఖలు చేసిన మెమోలో అవినాష్ తల్లికి శస్త్ర చికిత్స జరగనేలేదని, సర్జరీ జరుగుతున్నట్టుగా ఆయన కోర్టుకు అబద్ధం చెప్పారని, కాబట్టి ఆయన మీద కోర్టు చర్యలు తీసుకోవాలి అంటూ ఆమె తాజాగా విజ్ఞప్తి చేసింది.

 

తండ్రిని హత్య చేశారనే బాధ సునీత కు ఖచ్చితంగా ఎంతో కొంత ఉంటుంది. తండ్రిని చంపిన వారిని కటకటాల వెనక్కు పంపి తీరుతానని ఆమె ప్రతిజ్ఞ తీసుకుని ఉండవచ్చు. పోరాటం సాగిస్తోంది. అంతవరకు ఆమెను సమర్థించే వారు కూడా అనగలరు. కానీ అవినాష్ రెడ్డి తల్లికి వారు చెప్పినట్టుగా శస్త్రచికిత్స జరగలేదు గనుక- చర్యలు తీసుకోవాలని సంబంధంలేని విషయంలో డిమాండ్ చేయడం మరీ హేయంగా ఉంది. ఎందుకంటే ఆస్పత్రికి తీసుకువచ్చినప్పుడు డాక్టరు శస్త్రచికత్స అవసరం అని చెప్పి ఉండవచ్చు ఆ సమయానికి అవినాష్ తరఫు న్యాయవాది కోర్టుకు ఆమేరకు విన్నవించి ఉండవచ్చు. ఒకటో రెండో రోజుల ట్రీట్మెంట్ తరువాత సర్జరీ అవసరం లేదని డాక్టరు భావించి ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితులు అనూహ్యం కాదని స్వయంగా పెద్ద డాక్టరు అయిన సునీతకు తెలియని సంగతి కాదు. పైగా అక్కడ సర్జరీ జరిగిందా లేదా అనేది వివేకా హత్య కేసుతో సంబంధం లేని సంగతి. అయినా కూడా ఏదో అవినాష్ ను చికాకు పెట్టడమే తన జీవితాశయం అన్నట్టుగా ఆయన మీద చర్యలు తీసుకోవాలని సునీత కోరడం చిత్రమైన సంగతి. దీంతో సునీత చాలా ఎక్కువ చేస్తోందని, వైయస్ జగన్ ఆమెను ఏదో ఒక రోజు టార్గెట్ చేస్తారు అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 

Related Articles

ట్రేండింగ్

Nandyal: మా జీవితాలను మీరే నాశనం చేశారు.. వైసీపీ ఎమ్మెల్యే భార్యకు భారీ షాక్ తగిలిందా?

Nandyal: ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని రోజులలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో నామినేషన్ ప్రక్రియలు కూడా చాలా వేగవంతంగా జరిగాయి. ఇక నేటితో నామినేషన్స్ కూడా పూర్తి అయ్యాయి. ఇక నామినేషన్ వేసిన అభ్యర్థులందరూ కూడా...
- Advertisement -
- Advertisement -