TTD’s Pink Diamond: పింక్ డైమండ్ ఎక్కడ జగన్.. ఎన్నికల్లో గెలుపు కోసం ఎంత నీచానికైనా దిగజారుతారా?

TTD’s Pink Diamond: జగన్మోహన్ రెడ్డి 2019 సంవత్సరంలో అధికారంలోకి రావడం కోసం ఎన్నో నాటకాలను కూడా వేశారు అందులో భాగంగా కోడి కత్తి కావడం వైయస్ వివేక హత్య కావడం వంటివి ఒకటి కాగా శ్రీవారి పింక్ డైమండ్ పాయే అనే నాటకం కూడా ఒకటని చెప్పాలి. ఎన్నికలకు ఏడాది ముందు నుంచి స్వామివారికి తరతరాలుగా వస్తున్నటువంటి రాజుల సంపద అయినటువంటి పింక్ డైమండ్ కనిపించకుండా పోయిందని అది ఎలా మాయమైందో తెలియదు అంటూ సాక్షాత్తు శ్రీవారి ప్రధాన అర్చకులు రమణ దీక్షితులతో జగన్మోహన్ రెడ్డి చెప్పించడం గమనార్హం.

ఇలా కలియుగ దైవమైనటువంటి శ్రీవారి పింక్ డైమండ్ కనిపించకుండా పోవడంతో ఆ విషయాన్ని ప్రధాన అర్చకులు ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పడంతో ఈ విషయం కాస్త సంచలనగా మారింది. పింక్ డైమండ్ ఉంది కనిపించలేదని రమణ దీక్షితులు లేదని టీటీడీ అధికారులు వాదోపవాదనలకు దిగారు. దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ విద్యాసాగర్‌ అనే వ్యక్తి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రభుత్వం నియమించిన రెండు విచారణ కమిషన్లు 1952 నుంచీ టీటీడీ రికార్డులు పరిశీలించి.. పింక్‌ డైమండ్‌ లేదని తేల్చేశారు.

ఇలా అధికారులు పింక్ డైమండ్ లేదని తేల్చి చెప్పడంతో ఈ విషయంలో సీబీఐ విచారణ అవసరం లేదని హైకోర్టు 2021 ఫిబ్రవరి 7న తీర్పు చెప్పింది. కానీ రమణ దీక్షితులు మాత్రం లేనిది ఉన్నట్టుగా చూపించడం కోసం పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ లు పెడుతూ ఎన్నో నాటకాలు ఆడారు అంతేకాకుండా ఒక్కో ప్రెస్ మీట్ లో ఒక్కో విధంగా మాట్లాడుతూ అందరిని నమ్మించే ప్రయత్నం చేశారు. 2001వ సంవత్సరం నుంచి ఈ పింక్ డైమండ్ కనిపించలేదని తెలిపారు.

ఇలా జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు శ్రీవారి పింక్ డైమండ్ గురించి పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా ఆ పింక్ డైమండ్ గురించి ప్రస్తావనకు తీసుకు వచ్చిన సందర్భాలే లేవు. దీంతో పలువురు స్వామి వారి పింక్ డైమండ్ ఎక్కడ ఎందుకు ఈ విషయం గురించి ప్రభుత్వం మాట్లాడడం లేదంటూ ప్రశ్నలు వేస్తున్నారు. అయితే ఇదంతా కూడా రాజకీయ గెలుపు కోసం జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి నాటకమని స్పష్టంగా తెలుస్తోంది. ఈ విషయం తెలిసి రాజకీయాల కోసం ఎంతకైనా జగన్మోహన్ రెడ్డి దిగజారుతారంటూ పలువురు విమర్శలు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -