AP Volunteers: వాలంటీర్లు రాజకీయ కరివేపాకులా… వైసీపీ ఆటలో వీళ్లు బలి అవుతున్నారా?

AP Volunteers: మీరే నా సైన్యమని జగన్ కాకాపడుతూ వాలంటీర్లను ఐదేళ్లుగా మోసం చేస్తున్నారు. ఎన్ని రకాలుగా వాడుకోవాలో అన్ని రకాలుగా వాడుకొని వారిని కూరలో కరివేపాకులా తీసి పడేస్తున్నారు. మీరే భవిష్యత్ లీడర్లు అంటూ ఐదేళ్లుగా ఐదువేల రూపాయలకు వారితో ఊడిగం చేయిస్తున్నాయి. జగన్ సీఎం అయ్యేనాటికి డిగ్రీ కంప్లీట్ చేసిన ఇద్దరు కుర్రాళ్లులో ఒకరు వాలంటీర్‌గా సెటిల్ అయితే.. మరొకరు కోచింగ్ తీసుకొన సాఫ్ట్‌వేర్ సైడ్ వెళ్లాడు. వాలంటీర్ జీతంలో మార్పులేదు. సాఫ్ట్‌వేర్ జీవితం అమాతంగా మారిపోయింది. ఇది ప్రతీ గ్రామంలో జరిగిన వాస్తవం. సొంత అవసరాల కోసం డిగ్రీలు చేసినవారిని కూడా వాలంటీర్లను నియమించారు. జగనన్న తమ జీవితాల్లో మార్పు తీసుకొస్తారని యువత కూడా అప్పట్లో ఈ వాలంటీర్ ఉద్యోగాల కోసం ఎగబడ్డారు. కానీ.. ఐదేళ్లు తిరిగే సరికి సాఫ్ట్‌వేర్ స్నేహితుడి ఒకరోజు జీతం.. తన నెల జీతానికి సమానమైంది.

ఆ తర్వాత వారాహి యాత్రలో పవన్ కొంతమంది వాలంటీర్లను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. మానవ అక్రమ రవాణా జరుగుతుందని.. దీనిలో వాలంటీర్లే కీలకంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది ఉద్దేశించిన చేసిన ఈ కామెంట్స్ ను వైసీపీ నేతలు వాలంటీర్లు అందరికి ఆపాధించారు. అంతేకాదు.. వారందరితో ధర్నాలు, నిరసలను చేయించారు. ఐదు వేల జీతానికి వాళ్లు చేసే పనే ఎక్కువ. అదిచాలదని వైసీపీ నేతలు తమ రాజకీయ లబ్ధికోసం వాలంటీర్లను రోడ్డెక్కించారు.

ఇప్పుడు ఎన్నికల్లో వాలంటీర్లను విధులకు దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశించింది. అంతేకాదు.. పింఛన్ల పంపిణీ కూడా చేయొద్దని చెప్పింది. ఎన్నికల నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఓ రకంగా చెప్పాలంటే.. వాలంటీర్లకు పని భారం తగ్గించింది. దాన్ని కూడా వైసీపీ రాజకీయం చేయడం మొదలు పెట్టంది. ఎన్నికల్లో వాలంటీర్లను వాడుకొని ఓటర్లను ప్రలోభాలకు గురి చేయాలని.. వినకపోతే బెదిరింపులకు దిగాలని చూసింది. అది వర్క్ అవుట్ అవ్వలేదని.. వైసీపీ నేతలు ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తున్నారు. వాలంటీర్లపై ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. అయితే.. ప్రతిపక్షాలు, అధికార పక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవాలి కానీ.. వాలంటీర్లను ఎందుకు భద్నాం చేయాలి? వాలంటీర్లను మూడుకుమ్మడి రాజనామాలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. తాము ప్రజలకు సేవ చేస్తుంటే నిందలు వేస్తున్నారని చెప్పి వాలంటీర్లు రిజైన్లు చేయాలని వైసీపీ నేతలు ఒత్తిడి చేస్తున్నారు. వైసీపీ కుట్రలను గమనించి వాలంటీర్లు అసలు వారి ఒత్తిడికి తలొగ్గేదే లేదని చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామాకు ససేమేరా అంటున్నారు.

ఉమ్మడి కృష్ణా జిల్లాలో 9,600 మంది వాలంటీర్లు ఉన్నారు. అందులో 880 మంది ఇప్పటి వరకూ రాజీనామా చేశారు. మచిలీపట్నం నియోజకవర్గంలో పేర్ని నాని బెదిరింపులకు 860 మంది తలొగ్గగా… మిగిలిన నియోజకవర్గాల్లో 20 మంది వరకూ రాజీనామా చేశారు. ఎన్టీఆర్‌ జిల్లాలో 10,418 మంది వలంటీర్లు ఉంటే.. కేవలం ఆరుగురే రాజీనామా చేశారు. అధికారపార్టీ నుంచి పెద్ద ఎత్తున ఒత్తిళ్లు వచ్చినా.. వారు తలొగ్గలేదు.

ఒంగోలు నగరంలో 70 సచివాలయాల్లో 1300 మంది వాలంటీర్లు ఉన్నారు. వీరి సేవలు నిలిచిపోవడానికి ప్రతిపక్షనేతలే కారణమని సోషల్ మీడియలో ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు.. ఆ ప్రచారాన్ని ఎమోషనల్ గా మార్చారలని వారితో రాజీనామా చేయిస్తున్నారు. కానీ.. భవిష్యత్ పై భయంతో కొంతమంది రాజీనామాకు అంగీకరించడంలేదు. రాజీనామా చేస్తే తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని చెబుతున్నారు. కానీ.. ఇప్పుడు రాజీనామా చేస్తే తర్వాత తర్వాత మళ్లీ చేరాలంటే సాంకేతిక సమస్యలు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా వైసీపీ నేతలు వారి రాజకీయ లబ్ధి కోసం వాలంటీర్ల జీవితాలతో ఆడుకుంటున్నారు.

జీతం బకాయిలు వైసీపీనే చెల్లిస్తుందని నేతలు చెబుతున్నా.. వలంటీర్లు నమ్మడం లేదు. అంతేకాదు.. వైసీపీ నేతల ఒత్తిళ్లతో నరసరావుపేటలో కొందరు వాలంటీర్లు రాజీనామా చేశారు. కానీ, వారి దగ్గర ఉన్న మొబైల్‌, వేలి ముద్రల స్కానింగ్‌ పరికరాలు మాత్రం ఇవ్వలేదు. మూడు నెలలుగా పెండింగ్ లో ఉన్న జీతం ఇస్తేనే డివైజ్ లు ఇస్తామని తేల్చి చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -