YSRCP: మాటలతో ప్రజల్ని మాయ చేస్తున్న జగన్ సర్కార్.. అన్ని పథకాలు ఉత్తుత్తి పథకాలేనా?

YSRCP:  లడ్డు కావాలా నాయనా? రెండు లడ్డూలు కావాలా నాయనా అన్నంత ఈజీగా వైసీపీ నాయకులు పథకాలను పంచిపెడుతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కనుక ఇళ్లు కావాలా? ఆరోగ్య శ్రీ కావాలా? ఏం కావాలని అడిగి మరి ప్రభుత్వ పథకాల కార్డులు పంచిపెడుతున్నారు. అడిగినా.. అడగకపోయినా పట్టాలు ఇంటికి వెళ్లి మరీ ఇస్తున్నారు. రిజిస్ట్రేషన్ కూడా చేయిస్తున్నారు. మరి భూమి ఎక్కడుందయ్యా అని అడిగతే.. ఆ ఒక్కటి అడక్కు అన్నటు చూస్తున్నారు. లేని భూమికి రిజిస్ట్రేషన్, పట్టాల పంపిణి జరిగిపోతుంది. ఇలా ఒకటా రెండా.. ఎన్నికల టైం కనుక ప్రతీ ఇంటికి వెళ్లి పనికిరాని ప్రభుత్వ పథకాల కార్డుల పంపిణీ చేస్తున్నారు. మరో విచిత్రం ఏంటంటే.. ఆరోగ్య శ్రీకార్డులు కూడా పంచిపెడుతున్నారు. జగనన్న మరోసారి అధికారంలోకి వస్తే ఏడాదికి 20 లక్షల వరకు ఉచిత వైద్యం చేసుకోవచ్చని చెబుతున్నారు. అయితే జగనన్న మరోసారి అధికారంలోకి రావడమేంటీ? ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా? ఆస్పత్రికి వెళ్తే డాక్టర్లు నో ఆరోగ్య శ్రీ అంటున్నారని ప్రజలు చెబుతున్నారు. మరి దానికి వైసీపీ నాయకులు దగ్గర సమాధానం లేదు.

ప్రభుత్వ పథకాల పేరుతో వైసీపీ నాయకుల మోసాలు పీక్స్‌కి చేరాయి. ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ అంటూ నవరత్నాలు అమలు చేస్తున్న జగన్ కు అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరకే వాస్తవం అర్థమైంది. కూర్చొని తింటే కోట్లు అయినా తరిగిపోతాయన్నట్టు… అభివృద్ధి లేకుండా పంచిపెడితే ఏం ఉండదని బోదపడింది. అలా అని అభివృద్ధిపై దృష్టి పెట్టారా అంటే..అదీ లేదు. ఒక్కో పథకంలో కోతలు మొదలు పెట్టారు. హాజరు పేరుతో అమ్మఒడిలో కోత పెట్టారు. అంతేకాదు.. ప్రతీనెల జనవరిలో ఇవ్వాల్సిన అమ్మఒడి జూన్‌కు మార్చారు. దీంతో.. ఈ ఏడాది అమ్మఒడి ఖర్చు తగ్గింది. కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందని.. కారు ఉందని తెల్ల రేషన్ కార్డును తొలగించారు. ఉపాధి కోసం కారు నడుపుకుంటున్నా.. వాళ్లను ధనవంతుల జాబితాలో వేసేశారు. ఇక, ఆరోగ్యశ్రీ దగ్గరకు వస్తే.. ఎన్నికల్లో వంద రూపాయల నోటు పంచినట్టు ఆరోగ్యశ్రీ కార్డులు పంచారు.

కార్డులు పంచినంత మాత్రాను పథకం అములు జరుగుతుందా? ఆస్పత్రికి డబ్బులు ఇవ్వాలి కదా? ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకపోవడంతో ఇక యాజమాన్యాలు నో ఆరోగ్య శ్రీ అని బోర్డులు పెట్టేశారు. ఇక.. ఇళ్ల పట్టాల విషయానికి వచ్చినట్టు అయితే.. 31 లక్షల ఇళ్లు పట్టాలు పంపిణీ చేశామని చెబుతున్నారు. అవి కూడా పట్టా పుస్తకాలు ఇస్తే సరిపోతుందా? భూమి కనిపించాలి కదా? ఎక్కడ అంటే.. నాయకులు, అధికారులు పుస్తకంలో పట్టా నెంబర్ ఉంది చూడండి అంటున్నారు. కొద్దో గొప్పో ఇచ్చారు అంటే.. అవి కూడా ఊరు చివరన, శ్మశానం దగ్గర ఇచ్చారు. దీంతో.. లబ్ధిదారులు అక్కడ ఇళ్లు కట్టడానికి ఆసక్తి చూపడం లేదు. ఇలా 25 లక్షల ఇళ్ల స్థలాలు దేనికి పనికి రాకుండా ఉన్నాయి.

గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చింది లేదు కానీ.. మరోసారి మోసానికి రెడీ అయ్యారు. ఏం కావాలో చెప్పండి అంటున్నారు. ఆపరేషన్ దుర్యోదన సినమాలో హైద్రాబాద్ కు సముద్రాన్ని తీసుకొని వస్తా అన్నట్టు.. ఏం కావాలంటే అది ఇచ్చేస్తా అంటున్నారు. ప్రస్తుతానికి కార్డులు ఇస్తే చాలు కదా అనుకుంటున్నారు. 40 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే రైతులు చేతిలో రూపాయి పెట్టలేదు. కానీ, ఇప్పుడు రైతులు రుణమాఫీ హామీకు కూడా సిద్దమవుతున్నారు. దీంతో.. సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. సిద్దం.. సిద్దం అని అంటే దేనికో అనుకున్నాం కానీ.. ప్రజలకు మరోసారి అబద్దపు హామీలు ఇవ్వడానికి వైసీపీ నేతలు సిద్దం అని అంటున్నారు. అంతేకాదు.. జగన్ ప్రతీ సభలో సిద్దమా? సిద్దమా? అని ప్రజలను అడుగుతున్నారు.. మరోసారి మోసపోవడానికి సిద్దమా? అని అడుగుతున్నట్టు ఉందని సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -