YSRCP: ప్రజాధనంతో చికెన్ భోజనాలు.. వైసీపీ ఎమ్మెల్యేల తీరు ఎప్పటికీ మారదా?

YSRCP: త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సిపి నాయకులు మీటింగులు పెట్టి తమ పార్టీ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆసరా చెక్కు పంపిణీ చేయడం కోసం జోగి రమేష్ ఏర్పాటు చేసినటువంటి సభ గురించి తాజాగా ఒక వార్త వెలుగులోకి వచ్చింది జోగి రమేష్ సభకు వచ్చిన వారందరికీ చికెన్ బిర్యానీలు పెడుతూ అక్కడికి వచ్చిన వారి ఆకలిని తీర్చారు అయితే తన సొంత డబ్బుతో వారి ఆకలి తీర్చినట్లు జోగి రమేష్ చెప్పుకుంటున్నారు.

ఇలా సభకు పెద్ద ఎత్తున డ్వాక్రా సంఘాల మహిళలను తరలించి కార్యక్రమాలలో నిర్వహించడమే కాకుండా తమ పార్టీని ప్రచారం చేసుకుంటున్నారు. అంతేకాకుండా ఆ సభను ఏర్పాటు చేయడం కోసం అయిన ఖర్చు నుంచి మొదలుకొని అక్కడికి వచ్చిన వారికి భోజనం ఖర్చు వరకు ప్రజల సొమ్మునే ఉపయోగిస్తున్నారని తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఇలా ఒక ప్రభుత్వ నమూనా చెక్కును విడుదల చేయడం కోసం పెద్ద ఎత్తున ఆర్పాటం చేస్తున్నారు. సేమియానా నుంచి మొదలుకొని కుర్చీలు టెంట్లు డిజేలు అలాగే అక్కడ వచ్చిన వారికి చికెన్ బిర్యానీలు ఖర్చు మొత్తం ప్రజలు చెల్లిస్తున్నటువంటి పన్నులని ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. ఇలా ఏ నాయకుడు కూడా తమ సొంత జోబి నుంచి డబ్బులు తీసి ఇవ్వడం లేదు ఇలా ప్రజలు కట్టిన పన్ను ని మున్సిపల్ ఆఫీసుల నుంచి బిల్లులుగా పెడుతున్నారని తెలుస్తోంది.

పోరంకి సర్కిల్లో ఈ నెల 12వ తేదీ నిర్వహించినటువంటి ఆసరా సభ కోసం ఏకంగా 4.9 లక్షల రూపాయలు ఖర్చు అయిందని తెలుస్తోంది. అయితే ఈ ఖర్చు మొత్తాన్ని తాడిగడప మున్సిపాలిటీకి బిల్లులు పెట్టారు. ఇలా ప్రజల నుంచి పన్నుల రూపంలో పెద్ద ఎత్తున డబ్బును లాగుతూ వాటిని తమ పార్టీ స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని, పలువురు వైసిపి నాయకుల వ్యవహార శైలి పై వారి తీరుపై మండిపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -