YS Jagan: కాన్ఫిడెన్స్ కోల్పోయిన వైసీపీ.. భారీ ప్రచారాలతో గెలుపు సాధ్యమేనా జగన్?

YS Jagan: ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు మరో నెల రోజులకు పైగా సమయం ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పుడూ లేనంత ఉత్సాహం ప్రచారం చేస్తున్నారు. ప్రజాగళం యాత్రంలో పవన్ కూడా తోడవ్వడంతో కూటమి కేడర్ లో ఉత్సాహం డబుల్ అయింది. కానీ… వైసీపీ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. వైసీపీ కేడర్ లో నిరుత్సాహం కనిపిస్తోంది. ఆ నిరుత్సాహం జగన్ ఉగాధి వేడుకుల్లో స్పష్టమైంది. మామూలుగా అయితే, జగన్ ఏం చేసినా ఆర్భాటంగా చేస్తారు. ఏ కార్యక్రమం గురించి అయినా కొన్ని రోజుల పాటు చర్చించుకునేలా చేస్తారు. కానీ.. జగన్ ఉగాధి వేడుకులో ఎలాంటి ఆర్బాటం లేకుండా చేశారు. పైగా పంచాంగం, జాతకం, భవిష్యత్ గురించి కూడా బయటకు రాలేదు. జగన్ సహజ వైఖరి బట్టి చూస్తే పెద్ద ఎత్తున భజన పరులను పక్కన పెట్టుకొని ఢంకా వాయించాలి. ఈసారి ఎన్నికల్లో 175 స్థానాల్లో వైసీపీ గెలుస్తోందని చెప్పించాలి. మీడియాలో కూడా ఈ మేరకు ప్రకటనలు ఇవ్వాలి. కానీ, అది జరగలేదు. సీఎం జగన్ తో పాటు ఆయన సతీమణి పూజలు నిర్వహించి మమా అనిపించారు. అంతేకాదు.. ఈ మధ్య వైసీపీ అధినేత చాలా నీరసంగా కనిపిస్తున్నారు. దీనిపై సర్వత్ర చర్చ జరుగుతోంది.

జగన్ మాత్రమే కాదు.. పార్టీ నాయకులు, క్యాడర్‌లో కూడా ఉత్సాహం తగ్గింది. నీరసం పెరిగింది. బస్సు యాత్ర కూడా జరుగుతుందో లేదో అన్నట్టు మారింది. జగన్ బస్సు యాత్రకు ప్రజలే కాదు.. కార్యకర్తలు కూడా పెద్దగా హాజరుకావడం లేదు. జనసమీకరణ నాయకులకు పెద్ద సవాల్ గా మారుతోంది. మండల కేంద్రాల్లో 5 వందల మందిని కష్టపడి పోగేస్తున్నారు. అంతేతప్పా.. జగన్ బస్సుతో పాటు వెళ్లేవారు కనిపించడం లేదు. గ్రామ స్థాయి నేతలకు డబ్బులిచ్చినా వారిని నుంచి స్పందన రావడం లేదు. గ్రామాల్లో కాస్తో కూస్తో పలుకుబడి ఉన్న నేతలకు పదేసి వేలు ఇస్తున్నారని టాక్ నడుస్తోంది. కానీ, వారు డబ్బు తీసుకొని ఇంట్లో కూర్చుంటున్నారట. దీంతో జగన్ బస్సు యాత్ర నీరసంగా సాగుతోంది. దీంతో.. పార్టీ అభ్యర్థుల్లో కూడా నీరసం పెరుగుతోంది. కొంతమందిద గుంభనంగా ఉండి.. గెలుస్తామని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. కానీ.. ఎన్నికల తర్వాత ఫలితం ఎలా ఉంటుందో వాళ్లు కూడా అంచనా వేసుకున్నారు. ఏ మాత్రం నమ్మశక్యం లేని ప్రచారాలతో అప్పులు చూస్తే రాష్ట్రాన్ని దివాలా తీయించిన వైనం ప్రజల్లో ప్రభావాన్ని చూపిస్తోంది. చాలా పథకాలకు జగన్ బటన్ నొక్కారు కానీ.. డబ్బు మాత్రం జమ కాలేదు. కానీ, చాలా మందికాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారు. ఈ విషయాన్ని పథకాల లబ్ధిదారులు జీర్ణించుకోలేకపోతున్నారు.

పోటీలో ఉన్న చాలా మంది వైసీపీ అభ్యర్థులు టికెట్ ఎందుకు వచ్చిందా? అని అనుకుంటున్నారు. ఎలాగూ ఓడిపోయేదానికి ఎందుకీ శ్రమ అని నిట్టూర్చుతున్నారు. ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నవారు అప్పు చేసి ప్రచారం చేయాలి. గెలిచే అవకాశం లేనప్పుడు ఈ అప్పులు అవసరమా? అని అనుకుంటున్నారు. అలాంటి వారికి అధిష్టానమే డబ్బు సర్థుబాటు చేస్తుందని టాక్ నడుస్తోంది. ఎన్నికల వరకు నీరసాన్ని బయట పెట్టకుండా ప్రచారం చేయాలని తాడేపల్లి నుంచి ఆదేశాలు వస్తున్నాయి. కానీ, జగనే నీరసంగా కనిపిస్తే.. ఇంకా అభ్యర్థులు ఎలా యాక్టివ్ గా ఉంటారు? పైగా ఎన్నికలకు ఇంకా చాలా రోజులు సమయం ఉంది. ఇప్పుడే ఇంత నీరసంగా ఉంటే .. ముందు ముందు మరెంత నీరసంగా ఉంటారో?

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -