Uttarandhra: ఉత్తరాంధ్రలో వైసీపీ సీనియర్లకు వరుస షాకులు తగులుతున్నాయిగా.. అయ్యో పాపం అనేలా?

Uttarandhra: ఏపీ రాజకీయాల్లో ఉత్తరాంధ్రకు రాజకీయంగా ఓ ప్రాముఖ్యత ఉంది. ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఏ పార్టీ ఎక్కువ ప్రభావం చూపిస్తే.. ఆ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. ఆ ప్రాంతం నుంచి కనీసం ఆరుగురు రాష్ట్ర మంత్రులు, కేంద్రప్రభుత్వంలో భాగంగా ఒక కేంద్రమంత్రి పదవి కూడా ఆ ప్రాంతానికి దక్కుతుంది. కింజిరాపు ఎర్రనాయుడు, అశోక్ గజపతిరాజు, కిల్లికృపారాణి ఇలా వీరంతా ఉత్తరాంధ్రకు చెందిన మాజీ కేంద్రమంత్రులే. అంటే.. ఈ వెనకబడిన ప్రాంతానికి ఎంత రాజకీయ చైతన్యం, ప్రాముఖ్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. కింజిరాపు, కిమిడి, బొత్స, ధర్మాన, విజయనగరం రాజులు.. వీరంత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే రాజకీయంగా రాష్ట్ర రాజకీయాలను శాసించిన వారే. ఇక్కడ గాలి ఎటువైపు వీస్తే.. ఆ పార్టీకి అధికారం వస్తుంది. ఉత్తరాంధ్రలో 34 నియోజవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో 25కి పైగా స్థానాలు వైపీపీ ఖాతాలోనే పడ్డాయి. జగన్ ఆరు మంత్రిపదవులతో పాటు.. స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ఉపముఖ్యమంత్రి పదవి కూడా ఉత్తరాంధ్ర నేతలకే కట్టబెట్టారు. అయితే.. ఈసారి అక్కడ పరిస్థితులు వైసీపీ వ్యతిరేకంగా ఉన్నాయి. జిల్లాలో కీలక నేతలకు ఎదురుగాలి వీస్తోంది. సీనియర్ల తీరును వ్యతిరేకిస్తూ కిందిస్థాయి నేతలు పార్టీకి రాజీనామా చేస్తున్నారు. అధికారంలో ఉన్నంతకాలం తమని పట్టించుకోని నేతలకే అధిష్టానం అందలం ఎక్కిస్తుందని ఆగ్రహంగా ఉన్నారు.

గాజువాకలో గుడివాడ అమర్నాథ్ పరిస్థితి వైసీపీలో గందరగోళంగా మారింది. ఆయనకు స్థానిక నేతలు సహకరించడం లేదు. స్థానిక ఎమ్మెల్యే నాగిరెడ్డి, ఇటీవల సమన్వయకర్తగా తొలిగించబడిన ఉరుకూటి చందుతో పాటు.. వాళ్ల అనుచరులు అమర్నాథ్ కూటమి కడుతున్నారు. టికెట్ పోయిందని ఎమ్మెల్యే నాగిరెడ్డి, టికెట్ ఆశపెట్టి తర్వాత సమన్వయకర్తగా తొలిగించారని ఉరుకూటి చందు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. వైవీ సుబ్బారెడ్డి రంగంలోకి దిగినా పని కాలేదు. అక్కడ గుడివాడ అమర్నాథ్ ఓటమి ఖాయంగా తెలుస్తోంది. దీనికితోడు అమర్నాథ్ నోటి దురుసు కూడా ఆయనకు వ్యతిరేకంగా మారింది. ఉత్తరాంధ్రలో కాపులు ప్రభావం ఎక్కువ. కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కల్యాణ్ పై ప్రెస్ మీట్ పెట్టి తిట్లదండకం అందుకోవడానికి అమర్నాథ్ ముందుండేవారు. దాని ప్రభావం గట్టిగానే కనిపిస్తోంది.

ఇక.. ఆముదాలవలసలో స్పీకర్ తమ్మినేని సీతారాంకి ఎదురు గాలి వీస్తోంది. ఆయనకు టికెట్ ఇవ్వొద్దని స్థానిక నేతలు అధిష్టానానికి పలు సార్లు అర్జీలు పెట్టుకున్నారు. తమ్మినేనికి కూడా నోటి దురుసు ఎక్కువే. స్పీకర్ స్థానంలో ఉంటూనే ప్రతిపక్ష పార్టీ నేతలపై ఆయన చేసిన వ్యాఖ్యలు పలు సార్లు వివాదాస్పదం అయ్యాయి. అలాంటిది ఆఫ్ ది రికార్డు నియోజవర్గంలో ఎంత నోటిదురుసుతో ప్రవర్తిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయనకు టికెట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ నిరసిస్తూ పొందూరుకు చెందిన సీనియర్ నేత సువ్వారి గాంధీ రాజీనామా చేశారు.

ఇక పలాసలో మంత్రి సిదిరి అప్పలరాజుకు కూడా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఆయన ఒంటెద్దు పోకడలు ఆయనకు తలనొప్పులు తీసుకొచ్చాయి. అప్పలరాజుకు టికెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ కీలక నేత దువ్వాడ శ్రీకాంత్ నిరసనలు చేపడుతున్నారు. ఇప్పటికే అప్పలరాజును వ్యతిరేకిస్తూ సీనియర్ నేత హేమ బాబు చౌదరి పార్టీని వీడారు.

ఇచ్చాపురంలో విజయ, టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్‌, పాతపట్నంలో రెడ్డి శాంతికి టికెట్లు ఇవ్వడాన్ని కూడా క్షేత్రస్థాయి కేడర్ వ్యతిరేకిస్తున్నారు. ఇక విజయనగరం జిల్లాలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రరావుకు టికెట్ వద్దంటే వద్దని స్థానికులు చెబుతున్నారు. పరోక్షంగా బొత్స వర్గం కోలగట్ల అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. విజయనగరం వైసీపీ నేత అవనాపు విజయ్ నిరసన ర్యాలీ చేసి పార్టీను కూడా వీడారు. ఎస్ కోట నియోజకవర్గంలో కూడా అసంతృప్తి సెగలు మిన్నంటుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -