YCP Situation In Godavari: గోదావరిలో వైసీపీ పరిస్థితి ఇదీ.. వాళ్లు మాటలు వింటే జగన్ కు వాస్తవాలు తెలుస్తాయా?

YCP Situation In Godavari: ఏపీ రాజకీయాల్లో ఉభయ గోదావరి జిల్లాలు చాలా కీలకం. అక్కడ ఏ పార్టీ ఎక్కవ స్థానాలు గెలుచుకుంటే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. 2014లో టీడీపీ మెజార్టీ స్థానాలు గెలుచుకుంది. 2019లో టీడీపీని వైసీపీ చాలా తక్కువ స్థానాలకు పరిమితం చేసింది. ఆ రెండు ఎన్నికల్లో కూడా గోదావరి జిల్లాల ప్రజల మనోగతాన్నే రాష్ట్ర ఓటర్లు తెలియ జేశారు. గత ఎన్నికల్లో జనసేన విడిగా పోటీ చేయడం టీడీపీకి నష్టం జరిగింది. ఈ సారి ఆ రెండు పార్టీలకు కలిసి పోటీ చేస్తున్నాయి. దీంతో అక్కడ పరిస్థితి పూర్తిగా కూటమికి అనుకూలంగా మారిపోయింది. రెండు జిల్లాల్లో కలిపి వైసీపీకి ఐదు సీట్లు రావడం కూడా కష్టంగానే మారింది.

గోదావరి జిల్లాల్లో వైసీపీ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది. ప్రభుత్వం ఇళ్ల స్థలం ఇచ్చిందని చెబుతుంది కానీ.. కట్టుకోవడానికి డబ్బులు సరిపోవట్లదని ప్రజలు అంటున్నారు. కష్టపడితే రోజుకు 500 రూపాయలు వస్తున్నాయి కానీ.. ధరలు విపరీతంగా పెరగడం వనల దేనికీ సరిపోవడం లేదు. ఇంకా ఇళ్లు ఎలా కట్టుకుంటామని ఓ వ్యక్తి వ్యక్తం చేసిన ఆవేదన ఇది. రాష్ట్రంలో ఎవరికీ ఉద్యోగాలు లేవు. ప్రాజెక్టులు కూడా లేవు. దీనిపై ప్రజలు ఆలోచించడం మొదలు పెట్టానని మరో వ్యక్తి చెప్పాడు. కంపెనీలు రాక.. ఉద్యోగాలు లేక తాము చాలా ఇబ్బంది పుడుతున్నామని యువత చెబుతున్నారు. కానీ, ఈ సారి ప్రభుత్వం మారకపోతే హైదరాబాదో, బెంగళూరో వెళ్లిపోతామని అంటున్నారు. గోదావరి జిల్లాల నుంచి ఉపాది కోసం వేరే ఊరు వెళ్తామని చెప్పడం నిజంగా దౌర్భాగ్యమే. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనమని చెప్పడమే కానీ.. ప్రభుత్వ ఉద్యోగులకు కల్పిస్తున్న రక్షణ మాకు లేదని ఆర్టీసీ కార్మికలు చెబుతున్నారు. ఒకోసారి ప్రభుత్వ ఉద్యోగులంటారు. ఒకోసారి కార్పొరేషన్‌ ఉద్యోగులని అంటారు. ఈ రాయితీలు, వసతులు వర్తించబోవని చెబుతారు. ఎందుకు విలీనం చేశారో అర్థంకావడం లేదని ఆర్టీసీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దీంతో గోదావరి జిల్లాలో వైసీపీకి ఎదురుగా గాలి వీస్తోంది. నిజానికి టీడీపీ, జనసేన పొత్తు కుదిరినపుడే మెజారిటీ స్థానాలు కూటమి ఖాతాలో పడిపోతాయని అనుకున్నారు. కానీ.. వైసీపీ మాత్రం కనీసం రిజర్వుడు స్థానాల్లోనైనా గట్టెక్కుతామని భావించింది. అయితే, ప్రస్తుతం ట్రెండ్స్ చూస్తే ఆ పరిస్థితి కనిపించడం లేదు. వైసీపీకి చాలా నియోజకవర్గాల్లో డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితి లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నిన్న మొన్నటి వరకూ పరిస్థితి ఓ రకంగా ఉండేది. ఒకటో, రెండు స్థానాలు వైసీపీ ఖాతాలో పడతాయని అనిపించేది. కానీ..చంద్రబాబు, పవన్ కలిసి ప్రచారం చేస్తున్నారు. దీంతో.. ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. ఉమ్మడి ప్రచారానికి కనీవినీ ఎరుగని రీతిలో జనం వస్తున్నారు. నగర కూడళ్లు కిక్కిరిసిపోతున్నాయి. ఈ జనాన్ని చూసి చంద్రబాబు మురిపోతున్నారు. తన వయసును మర్చిపోయి మరింత ఉత్సాహంగా ప్రసంగిస్తున్నారు. చంద్రబాబు ప్రసంగం మరింత మందిలో ఉత్సాహాన్ని నింపుతోంది. దీంతో గోదావరి జిల్లాలోని 34 స్థానాల్లో 30కి పైగా స్థానాలు కూటమి ఖాతాలో పడటం ఖాయంగా తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -