Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ను ఓడించడానికి వైసీపీ చేస్తున్న ప్రచారం ఇదే.. ఈ ప్రచారాన్ని ప్రజలు నమ్ముతారా?

Pawan Kalyan: ఏపీలో ఇప్పుడు అందరి చూపు పిఠాపురంపైనే ఉంది. దానికి కారణం అక్కడి నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేయడమే. దీంతో.. పవన్ ను ఓడించడానికి జగన్ శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఇప్పటికే వైసీపీ పెద్ద సైన్యాన్ని దించింది. మండాలనికి ఓ ఇంచార్జ్, సామాజికవర్గానికి ఓ ప్రత్యేక ప్రతినిధిని దించారు. వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి, ముద్రగడ పద్మనాభం, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి కన్నబాబు వైసీపీలోని బడా నేతలంతా పిఠాపురంలోనే వాలిపోయారు. ఈ ఒక్క నియోజకవర్గంలోనే వైసీపీ 150 కోట్లు ఖర్చు చేస్తుందని ఓ అంచనా. దీంతో.. ఇక్కడ నుంచి వైసీపీ తరుఫున పోటీ చేస్తున్న వంగా గీత ప్రశాంతంగా ఉన్నారు. జగన్ నే తనను గెలిపించుకుంటారనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా జగన్ కొన్ని నియోజవర్గాలను సెలక్ట్ చేసుకున్నారు. అక్కడ విపక్ష నేతలను ఓడించాలనే పట్టుదలతో ఉన్నారు. మంగళగిరితో లోకేష్, కుప్పంలో చంద్రబాబు, టెక్కలిలో అచ్చెన్నాయుడు, పిఠాపురంలో పవన్ ను ఓడించాలని అస్త్రశస్త్రాలు సిద్దం చేస్తున్నారు. మంగళగిరిలో వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా.. వాటన్నింటిని తిప్పికొట్టేలా లోకేష్ ఎప్పుడో రెడీ అయిపోయారు. చంద్రబాబును కుప్పంలో ఓడించడానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సాయశక్తులా కృషి చేస్తున్నారు. టెక్కలిలో వైసీపీ పాచికలు పారే ప్రసక్తే లేదు. చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడిపై పెడుతున్నంత ఫోకస్ వైసీపీ.. ఒక్క పవన్ పైనే పెడుతున్నారు. గత ఎన్నికల్లో ఓడించినట్టే.. ఈసారి కూడా ఓడిస్తే.. పవన్ రాజకీయ భవిష్యత్ శూన్యం అయిపోతుందని భావిస్తున్నారు. అందుకే.. వైసీపీ పెద్ద సైన్యాన్నే దించింది. పిఠాపురంలో 60 వేలకు పైగా కాపు ఓటర్లు ఉన్నారు. ముద్రగడ పద్మనాభం వారితో మంతనాలు జరుపుతున్నారు. జగన్ కాపు ఓటర్లు బాధ్యత ముద్రగడపై వదిలేశారు.

ముద్రగడ రంగంలోకి దిగడం పవన్ కు ప్లస్ అయ్యేలా ఉంది. ఎందుకంటే.. ఇటీవల వైసీపీలో చేరిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. కాపుల కోసం కాదు.. వైసీపీ కోసం పని చేస్తానని చెప్పారు. అంతేకాదు.. తన రాజకీయ ఎదుగుదలలో కాపులు ఐదు శాతం మాత్రమే అండగా ఉన్నారని అన్నారు. కాబట్టి.. వైసీపీకి ఓటు వేయాలనుకున్న వారు కూడా.. ముద్రగడను చూసి వేయడం మానేస్తారని ఓ అంచనా ఉంది. ఇక, నియోజవర్గంలో పద్మశాలిలు, మత్స్యకారులు ఉన్నారు. ఇప్పటికే మత్య్సకారులతో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పలు దఫాలుగా భేటీ అయ్యారు. వారిని వైసీపీ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, విశాఖలో బోట్లు తగలబడిపోతే.. పవన్ తన సొంతడబ్బును పంచిపెట్టారు. దాని ప్రభావం పిఠాపురంలో కూడా ఉంటుందని.. మత్స్యకారులు ఓట్లు జనసేనకే పడతాయని చర్చ నడుస్తోంది. మరోవైపు అధికారులను కూడా వైసీపీ తమకు అనుకూలంగా ఉన్నవారని నియమించుకుంది. చివరి క్షణంలో పోలింగ్ బూత్ ల దగ్గర కూడా మేనేజ్ చేసేలా వ్యూహాలను సిద్దం చేస్తోంది.

వైసీపీ కొత్త ప్రచారానికి తెరలేపింది. పిఠాపురంలో పవన్ గెలిస్తే ప్రజలకు అందుబాటులో ఉండడని.. సినిమాలు చేసుకుంటాడని ప్రచారం చేస్తున్నారు. అదే వంగా గీత అయితే నిత్యం ప్రజల్లో ఉంటారని చెబుతున్నారు. సర్వశక్తులు ఒడ్డిన తర్వాత కూడా పవన్ గెలిచినా.. ఓ మహిళపై గెలిచారు. అదికూడా ఓ గెలుపేనా? చెప్పేందుకు కూడా సిద్ధం అవుతున్నారు. ఒకవేళ వంగాగీత గెలిస్తే.. మహిళపైనే ఓడిపోయారు. ఇంకా పవన్ ఇంట్లో కూర్చోవచ్చని ప్రచారానికి రెడీ అవుతున్నారు. ఎలాగైన పవన్ ను ఎమోషనల్ గా డ్యామేజ్ చేయడానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. అందుకే.. జనసేన కూడా అక్కడ ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టింది. వైసీపీలో అసంతృప్తిగా ఉన్నవారిని పార్టీలోకి ఆహ్వానిస్తోంది. కనీసం పవన్ లక్ష మెజారిటీతో గెలవాలని ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -