Koratala-Tarak: 20 కోట్ల షెడ్యూల్ క్యాన్సిల్ చేసిన యంగ్ టైగర్.. కొరటాల తారక్ ను ముంచుతాడో తేల్చుతాడో?

Koratala-Tarak: యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో నటించిన RRR సినిమా తర్వాత తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్లో దేవర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఆచార్య సినిమా డిజాస్టర్ అయిన తర్వాత కొరటాల తెరకెక్కిస్తున్న చిత్రం దేవర.

ఈ సినిమా ఆచార్య సినిమా పరిస్థితి కాకూడదన్న ఉద్దేశంతో ప్రతి ఒక్క విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇక ఈ సినిమా అవుట్ పుట్ మీద ఎన్టీఆర్ పూర్తి దృష్టి పెడుతున్నారని ఆయన ఓకే అంటేనే తదుపరి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేస్తున్నారని తెలుస్తుంది.

 

ఈ క్రమంలోనే తాజాగా 20 కోట్ల రూపాయలు పెట్టి భారీ సెట్లో ఒక యాక్షన్ సన్ని వేషాలకు సంబంధించిన షెడ్యూల్ పూర్తి చేశారని తెలుస్తుంది. అయితే ఈ షెడ్యూల్ రసేష్ చూసిన తర్వాత ఎన్టీఆర్ ఈ యాక్షన్ షెడ్యూల్ చిత్రీకరణ పై చాలా అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే మరోసారి ఈ యాక్షన్ సన్ని వేషాలను చిత్రీకరించాలని ఎన్టీఆర్ పట్టుబడినట్లు సమాచారం.

 

ఇలా 20 కోట్ల రూపాయలతో సీక్వెన్స్ షూటింగ్ పూర్తి చేసినప్పటికీ ఎన్టీఆర్ మరోసారి ఈ షెడ్యూల్ చిత్రీకరణ చేయడం కోసం భారీగానే ఖర్చు అవుతుందని తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఈ సినిమా కోసం దాదాపు 300 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు తెలుస్తుంది. ఇలా ఈ సినిమా కోసం ఇప్పటికే ఇంత ఖర్చు చేయగా ముందు ముందు ఇంకా ఎలాంటి ఖర్చులు వస్తాయో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -