Tarak: కోట్ల రూపాయల ఆస్తులను అక్కడ పెట్టుబడి పెడుతున్న తారక్.. ప్లాన్ భలే ఉందంటే?

Tarak: టాలీవుడ్ హీరో గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నందమూరి వారసుడిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. నటనపరంగా తాతకు తగ్గ మనవడు అని అనిపించుకున్నారు ఎన్టీఆర్. సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటు దూసుకుపోతున్నారు. ప్రస్తుతం తారక్ వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.. ఇందులో భాగంగానే గత ఏడాది ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు.

 

ఆర్ఆర్ఆర్ దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారీగా అభిమానులను సంపాదించుకున్న విషయం తెలిసిందే. దీంతో తారక్ కి ఉన్న క్రేజ్ డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ భారీగా సంపాదిస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. అంతేకాకుండా ఒక్కొక్క సినిమాకు 50 కోట్ల వరకు పారితోషికాన్ని అందుకుంటున్నారు. కాగా తారక్ ఒకవైపు సినిమాల్లో నటిస్తూ సినిమాలలో వచ్చిన డబ్బులను బిజినెస్ లు ఇన్వెస్ట్ చేస్తున్నారన్న విషయం మనందరికీ తెలిసిందే. కేవలం బిజినెస్ లో మాత్రమే కాకుండా తారక్ తన సంపాదనలో మెజారిటీ భాగాన్ని భూములపై ఇన్వెస్ట్ చేస్తున్నారట. భూములపై పెట్టుబడులు పెట్టడం వల్ల కళ్లు చెదిరే స్థాయిలో లాభాలు సొంతం కావడం ఖాయమని తారక్ ఫీలవుతున్నారని సమాచారం. ఈ మేరకు సినిమాల్లో వచ్చే డబ్బులను భూములకు భారీగా ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -