Movies: సెప్టెంబర్ లో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే.. పైచేయి సాధించే హీరో ప్రభాసేనా?

Movies: ప్రతినెలా థియేటర్లో పదుల సంఖ్యలో సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. అందులో కొన్ని పెద్ద సినిమాలు మరికొన్ని చిన్న సినిమాలు కూడా ఉంటాయి. ఓటీటీ లో కూడా మూవీస్, వెబ్ సిరీస్ లు కూడా విడుదల అవుతూ ఉంటాయి. సెప్టెంబర్ లో మాత్రం పోటీ మామూలుగా లేదు. వారానికో ప్రామిసింగ్ మూవీ వస్తోంది. సెప్టెంబర్ లో విడుదల కాబోతున్న సినిమాల విషయానికి వస్తే.. విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటించిన ఖుషి సినిమా సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వం వహించి ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఆ తర్వాత సెప్టెంబర్ 7వ తేదీకి మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి హీరో హీరోయిన్ లుగా నటించిన ఈ సినిమా ఇప్పటికే ఒకసారి వాయిదా పడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రామ్ పోతినేని, శ్రీలీలా కలిసి నటించిన స్కంద సినిమా సెప్టెంబర్ 15న విడుదల కానుంది.

 

అఖండ తర్వాత బోయపాటి నుంచి వస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇక సెప్టెంబర్ బాక్సాఫీస్ కు ఫినిషింగ్ టచ్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు సలార్. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్నంటాయి. ఎందుకంటే, కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ ను డైరక్ట్ చేశాడు. అయితే ఈ సినిమా విడుదల తేదీని ఇంకా ఫిక్స్ చేయలేదు. సెప్టెంబర్ 15న అని తెలుస్తోంది. ఇలా సెప్టెంబర్ లో వారానికో పెద్ద సినిమా విడుదల కానుంది. ప్రతి సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి.

Related Articles

ట్రేండింగ్

AP Roads: ఏపీలో రోడ్ల పరిస్థితిని చూపించి ఓట్లు అడిగే దమ్ముందా.. వైసీపీ నేతల దగ్గర జవాబులున్నాయా?

AP Roads:  ఒక రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలి అంటే ముందుగా ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలన్నీ కూడా సక్రమంగా ఉండాలి మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కరెంట్ నీరు వంటి వాటివి...
- Advertisement -
- Advertisement -