Volunteers Joined TDP: టీడీపీలో చేరిన 40 మంది వాలంటీర్లు.. దెబ్బ అదుర్స్ అంటున్న నెటిజన్లు!

Volunteers Joined TDP: త్వరలోనే ఏపీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో అందరి ఆసక్తి ఎన్నికల పైనే ఉంది అయితే ఈ ఎన్నికలలో వాలంటీర్ వ్యవస్థ కీలకంగా మారిన సంగతి మనకు తెలిసిందే. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారు. అయితే వాలంటీర్స్ సేవలకు గాను గౌరవ వేతనంగా 5000 ఇస్తున్న సంగతి తెలిసిందే.

ఇలా ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు బోలెడు పనులు చేయించుకుంటూ కేవలం 5000 రూపాయలు గౌరవ వేతనం ఇవ్వడంతో వాలంటీర్లు చాలీచాలని జీతంతో ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. గతంలో పలు సందర్భాలలో తమ జీతం పెంచాలని కూడా ప్రభుత్వాన్ని కోరారు. అయితే ప్రభుత్వం మాత్రం మీవి ఉద్యోగాలు కాదు సేవ మాత్రమేనని ఆ సేవకు గుర్తుకు గౌరవ వేతనం ఇస్తున్నామని చెప్పారు.

అయితే త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో వాలంటీర్లను తమ వైపు తిప్పుకోవాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు వరాల జల్లుల కురిపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్లకు పదివేల రూపాయల జీతం అంటూ ఈయన ప్రకటించడంతో కొంతమంది వాలంటీర్లు తెలుగుదేశం పార్టీలోకి వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారు.

ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ పరిధిలో ఏకంగా 40 మంది వాలంటీర్లు టిడిపి పార్టీలోకి చేరారు. ఈ మేరకు ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వాలంటీర్లను ఆహ్వానించారు ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ కూటమి గెలుస్తుందని కూటమి గెలిస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత పదివేల రూపాయల వస్తుంది అన్న భరోసా తోనే వీరంతా తమ పార్టీలోకి చేరారని తమ పార్టీలోకి వాలంటీర్లు వచ్చినందుకు ఈమె ప్రత్యేకంగా ధన్యవాదాలను తెలియజేశారు.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -