52 ఏళ్లుగా రూ. 3.50 కోట్లు ఖర్చు చేసి లాటరీ టికెట్లు కొన్నాడు. గెలిచిందెంతో తెలుసా?

అదృష్టమనేది ఎప్పుడు ఎవరిని వరిస్తోందో తెలిదు. చిల్లిగవ్వ కూడా లేనివారు రాత్రికి రాత్రే కోటీశ్వరులవుతారు.. కోట్ల ఆస్తి ఉన్న వారు క్షణాల్లో చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా అవుతారు. ఫలానా వ్యక్తి లాటరీ తగిలి కోటీశ్వరుడయ్యాడని.. ఓ సాధారణ కూలికి లాటరీలో లక్షలు వచ్చాయనే వార్తలు వింటుంటాం. ఒక్క లాటరీ తగిలితే ఉన్న అప్పులన్నీ కట్టుకోవచ్చు.. మంచి ఇంటిని కొనుకోవచ్చని చాలా మంది లాటరీలను కొనుగోలు చేస్తుంటారు. ఎన్ని సార్లు లాటరీ టికెట్‌ కొన్నా కూడా అది రాకపోయినా ఎప్పుడో ఒక్కసారైనా రాకపోదా అనే ఆశతో ఉన్న డబ్బులన్నీ పెట్టి లాటరీ టికెట్లు కొంటు నష్టపోతుంటారు.

అయితే.. ఓ సాధారణ వ్యక్తి లాటరీల కోసం ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ. కోట్లలో ఖర్చుచేశాడు. కేరళలోని కన్నౌర్‌కు చెందిన రాఘవన్‌ మాత్రం 52 ఏళ్లుగా లాటరీ టికెట్లను కొంటూనే ఉన్నాడు. రోజుకు పది టికెట్ల చొప్పున కొంటున్న రాఘవన్‌ అందుకోసం ఏకంగా రూ. 3. 50 కోట్లను ఖర్చు చేసినా కూడా రాఘవన్‌ కేవలం రూ. 5 వేలు మాత్రమే గెలుచుకున్నాడు. అయితే రాఘవన్‌ దినసరి కూలీ చేస్తూ అందులో వచ్చిన కొంత డబ్బును లాటరీ టికెట్ల కోసం వెచ్చించేవాడు. కేరళలో అత్యంత ఖరీదైన ఓనమ్‌ బంపర్‌ లాటరీని కూడా రాఘవన్‌ కొనుగోలు చేశాడు. ఆ టికెట్లన్నీ భద్రంగా గోనె సంచుల్లో దాచిపెట్టి తన అదృష్టం కోసం ఎదరు చూస్తునే ఉన్నాడు.

మధ్యతరగతి జీవనం వెళ్లదీస్తున్న రాఘవన్‌ లాటరీల కోసం 3 కోట్ల 50లక్షల వృథా చేసినా వాటిని కొనడం మాత్రం మానుకోను అని స్పష్టం చేస్తున్నారు. కుటుంబ సభ్యుల నుంచి కూడా అతనికి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. ఎప్పటికైనా తన భర్తకు అదృష్టం కలిసి వస్తుందని రాఘవన్‌ భార్య శాంత ఆశాభావంతో ఉంది. మొట్టమొదటి లాటరీని 1970లో 18 ఏళ్ల వయసులో కొనుగోలు చేసినట్లు చెప్పాడు రాఘవన్‌.

అయితే.. మరోవైపు.. కేరళ తిరువనంతపురానికి చెందిన ఓ ఆటో డ్రైవర్‌ ఇటీవల జాక్పాట్‌ కొట్టాడు. ఓనం బంపర్‌ లాటరీలో ఏకంగా రూ. 25 కోట్లు గెలుచుకున్నాడు. శనివారం టికెట్‌ కొన్న అతడికి ఆదివారమే భారీ జాక్పాట్‌ దక్కడం విశేషం. ఆటో డ్రైవర్‌గా పనిచేసే అనూప్‌ శ్రీవహారం ప్రాంతంలో ఉంటున్నాడు. శనివారం టికెట్‌ కొనేందుకు వెళ్లిన అతడు.. తొలుత వేరే టికెట్ను తీసుకున్నాడు. ఏమనిపించిందో ఏమో గానీ.. తర్వాత ఆ టికెట్‌ వెనక్కి ఇచ్చేసి వేరే టికెట్‌ తీసుకున్నాడు. ఇప్పుడు అదే టికెట్‌ రూ.25 కోట్లు సాధించింది.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -