6G: 6జీ గురించి ప్రస్తావించిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఈ టెక్నాలజీ అలా ఉండబోతుందా?

6G: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎర్రకోట పై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి అనంతరం జాతిని ఉద్దేశిస్తూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ఇలా దేశం గురించి ఎన్నో విషయాలను ప్రస్తావించిన నరేంద్ర మోడీ ఆర్థిక అభివృద్ధి పరంగా మన దేశం ప్రపంచంలోనే మూడవ స్థానంలో ఉందని ఈయన తెలియజేశారు. అదేవిధంగా మొబైల్ సాంకేతికత గురించి కూడా ఈ సందర్భంగా ప్రసంగించారు. ప్రస్తుతం మన దేశంలో 5 జి సాంకేతిక టెక్నాలజీ నడుస్తుందని త్వరలోనే 6జీ అందుబాటులోకి రాబోతుంది అంటూ ఈయన తెలియజేశారు.

ఇలా నరేంద్ర మోడీ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా మొబైల్ డేటా ప్లాన్ గురించి మాట్లాడారు.అంతర్జాతీయ ఎక్కడ లేకుండా కేవలం మన దేశంలోనే అత్యంత తక్కువ ధరలకే మొబైల్ డేటా ప్లాన్స్ అమలులో ఉన్నాయని తెలియజేశారు. ప్రస్తుతం 5 జి సేవలు దేశవ్యాప్తంగా 700 జిల్లాలలో ఉన్నాయని త్వరలోనే మారుమూల గ్రామాలకు కూడా ఈ సేవలు విస్తరించబోతున్నాయని మోడీ తెలిపారు.

 

అదేవిధంగా త్వరలోనే 6జీ కూడా రాబోతుందని తెలిపారు. దీనికోసం ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ను కూడా ఏర్పాటు చేసినట్లు నరేంద్ర మోడీకి తెలియజేశారు. ప్రస్తుతం ఉన్నటువంటి 5 జీ నెట్వర్క్ కంటే 6జీ వెయ్యి రేట్లు వేగంగా పనిచేస్తుందని తెలిపారు. 5 జీ నెట్వర్క్ ఒక సెకండ్ కి 10 గిగా బైట్స్ వేగంతో పని చేస్తే 6జీ నెట్వర్క్ మాత్రం ఒక సెకండ్ కు66 టెరాబైట్ వేగంతో పనిచేస్తుందని తెలిపారు. దీని ద్వారా డేటా బదిలీ చాలా వేగంగా జరుగుతుందని తెలుస్తోంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -