Ancient Ganesha idol: గణపతి నవరాత్రి వేళ.. భాగ్యనగరం బయటపడ్డ పురాతన వినాయక విగ్రహం.. ఏమైందంటే?

Ancient Ganesha idol: ప్రస్తుతం దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రి వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే భాగ్యనగరంలో అతి పురాతనమైనటువంటి విగ్రహం బయటపడింది. ఇలా గణేష్ నవరాత్రి సమయంలో ఈ పురాతన విగ్రహం బయటపడటంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేయడమే కాకుండా ఈ సమయంలో ఈ పురాతన విగ్రహం బయటపడటం నిజంగానే ఒక శుభ పరిణామం అని భావిస్తున్నారు.

నగరంలోని ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని పెద్ద గోల్కొండ గ్రామంలో సుమారు 800 ఏళ్ల నాటి పురాతన గణేశ విగ్రహం తాజాగా అతి పురాతనమైనటువంటి ఈ విగ్రహం బయటపడింది. ఇలా ఈ విగ్రహం వినాయక చవితి సమయంలోనే బయటపడటంతో భక్తులు పెద్ద ఎత్తున పూజలు చేస్తూ పూజిస్తున్నారు.

ఇక ఈ విగ్రహం కేవలం రెండు చేతులు, ఏక దంత, ఎడమ చేతిలో మోదకాన్ని పట్టుకుని.. , పసుపు రంగుతో ఉన్న సాధారణ ఆభరణాలతో అలంకరించబడి ఉంది.బొజ్జకు నాగాభరణం.. లలితాసనం అని పిలువబడే భంగిమలో గణేశుడు కూర్చున్నట్లుగా చెక్కబడి ఉంది. ఈ విగ్రహం మలచిన తీరు ఎంతో అందంగా ఉంది ఇలాంటి ఒక అరుదైన పురాతన విగ్రహం బయటపడటంతో ఇది నిజంగానే శుభ పరిణామం అని భావించి భక్తులు పూజలు చేస్తున్నారు.

ఇక ఈ విగ్రహం మలిచిన తీరుబట్టి చూస్తుంటే ఈ విగ్రహం సుమారు 8 సంవత్సరాల క్రితం నాటిదని చాళుక్యల కాలం నాటి విగ్రహం అని పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ విగ్రహం మాత్రమే కాకుండా ఈ పర్యటనలో అదే ప్రాంతంలో ఆంజనేయ ఆలయంలో 13వ శతాబ్దానికి చెందిన కాకతీయుల కాలం నాటి ఉమామహేశ్వర, నంది శిల్పాలను కూడా పరిశీలించింది. ప్రస్తుతం ఈ వినాయకుడి విగ్రహానికి సంబంధించిన ఫోటో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -