Devotional: ఏ పూజలో అయిన వినాయకుడిని ముందుగా ఎందుకు పూజిస్తారు తెలుసా?

Devotional: సాధారణంగా హిందువులు ఏదైనా శుభకార్యం మొదలు పెట్టినప్పుడు మొదట వినాయకుడిని పూజిస్తూ ఉంటారు. ఎటువంటి శుభకార్యం మొదలుప పెట్టినా అందులో మొదట విగ్నేశ్వరుడిని పూజించి ఆ తర్వాత మిగిలినవి పనులు చేస్తూ ఉంటారు. అలాగే విఘ్నేశ్వరుడు పూజించకుండా ఏ శుభకార్యం కూడా జరగదు అని చెబుతూ ఉంటారు. అయితే ఒకసారి మొదలు పెట్టినప్పుడు మొదట విగ్నేశ్వరుడుని ఎందుకు పూజిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అయితే ఇందుకోసం పురాణాల ప్రకారం రెండు ప్రధాన కథలు కూడా ఉన్నాయి. అందులో మొదటిది పార్వతీదేవి ఒకసారి స్నానానికి వెళుతూ వినాయకుడిని గదికి కాపలాగా ఉండమని చెప్పి వెళ్ళగా ఇంతలోనే శివుడు అక్కడికి రాగా లోపలికి రాకుండా అడ్డుకుంటాడు విగ్నేశ్వరుడు.

 

దాంతో కోపంతో శివుడు వినాయకుడి తలను నరికేస్తాడు. అప్పుడు పార్వతి దేవి బయటకు వచ్చి వినాయకుడిని చూసి వినాయకుడిని బతికించాలని లేదంటే విశ్వం నా మొత్తం నాశనం చేస్తానని బెదిరించడంతో వెంటనే శివుడు ఏనుగు తలను విఘ్నేశ్వరుడికి పెట్టి బ్రతికిస్తాడు. అయినప్పటికీ పార్వతి దేవి సంతోషించకపోవడంతో వెంటనే పరమశివుడు శుభకార్యానికి ముందు వినాయకుడిని పూజిస్తారని వినాయకుడి ఆశీర్వాదం లేకుండా ఏ పని పూర్తి కాదని అభయమిస్తాడు. అలా ఏ పూజ జరిగినా కూడా మొదట విగ్నేశ్వరుని పూజిస్తారు.

 

ఇక రెండవ కథ విషయానికి వస్తే.. ఒకసారి శివుడు కుమారస్వామికి విగ్నేశ్వరునికి ఒక పోటీ పెడతాడు. ఈ విశ్వం మొత్తం మూడు ప్రదక్షిణలు చేయమని పోటీ పెట్టి ఎవరైతే మొదట వస్తారో వారే మొదట పూజించే దేవుడిగా ప్రకటించబడతారు అని శివుడు ఆదేశించాడు. శివుడు చెప్పగానే వెంటనే కుమారస్వామి తన వాహనం నెమలి పై ఎక్కి విశ్వ ప్రదక్షిణ చేయడానికి వెళ్తాడు. అప్పుడు విగ్నేశ్వరుడు తన తల్లిదండ్రుల తన ప్రపంచం అని శివుడు పార్వతిలో చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి శివుడి మనసు గెలుచుకోవడం తో పాటు ఆ పోటీలో కూడా గెలుపొందుతాడు. ఆ తర్వాత గణేషుడిని ఆరాధించే మొదటి దేవుడిగా ప్రకటిస్తారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -