Ganapathi: గణపతిని చూసి ఈ విషయాలను నేర్చుకుంటే సక్సెస్ కావడం ఖాయమా?

Ganapathi: వినాయకుడిని ఆది దేవుడిగా భావిస్తూ ప్రథమ పూజను ఆయనకే చేస్తారు. వినాయకుడికి ప్రథమ పూజ చేయటం వల్ల మనం చేసే కార్యంలో ఏ విధమైనటువంటి ఆటంకాలు ఏర్పడకుండా ఉంటాయని భావిస్తారు. అందుకే వినాయకుడికి తొలి పూజ చేసి తనని పూజిస్తూ ఉంటారు. అయితే ఆది దేవుడు అయినటువంటి వినాయకుడిని చూసి మనం కొన్ని విషయాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. మరి వినాయకుడి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి అనే విషయానికి వస్తే…

తల్లిదండ్రుల కంటే ఎవరు ఎక్కువ కాదని మనం వినాయకుడి నుంచి నేర్చుకోవాలి ముల్లోకాలకు ఎవరు ముందు చుట్టేసుకొని వస్తారో వారికే తొలి పూజ అని శివపార్వతులు చెప్పినప్పుడు తల్లిదండ్రులే తనకు దైవ సమానంగా భావించి వినాయకుడు వారి చుట్టూ తిరుగుతూ ఆది దేవుడు అయ్యారు. విధి నిర్వహణ ముందు అనే విషయాన్ని కూడా వినాయకుడి నుంచి నేర్చుకోవాలి. పార్వతి దేవి వినాయకుడిని కాపలాగా పెట్టి స్నానానికి వెళుతుంది అయితే పరమశివుడు లోపలికి వెళ్లడానికి ప్రయత్నించగా తన విధి నిర్వహణ ముఖ్యమని భావించి శివుడిని అడ్డుకుంటారు.

 

ఆత్మగౌరవం ముఖ్యమని వినాయకుడిని చూసి నేర్చుకోవాలి. తనకు ఆకారం నచ్చకపోయినా స్వర్గానికి కాపలాగా నియమించి కాపలాగా వెళ్తారు. అయితే దేవతలకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని ఆయన వారు వెళ్లే దారి మొత్తం ఎలుకలతో గోతులు తవ్విస్తారు చివరికి దేవతలందరూ వినాయకుడికి క్షమాపణలు చెప్పుకుంటారు. ఇలా ఆత్మగౌరవం అనేది కూడా వినాయకుడిని చూసి నేర్చుకోవాలని చెప్పాలి.

 

వినాయకుడు నిరంతరంగా వేద వ్యాసుడు చెప్పినటువంటి మహాభారతాన్ని పూర్తి చేస్తారు. దీన్నిబట్టి ఏదైనా పని చేపడితే పూర్తి చేయాలనే విషయాన్ని కూడా వినాయకుడి నుంచి నేర్చుకోవాలి. ఇక చివరికి చందమామ వినాయకుడిని చూసి నవ్వగా తనకు శాపం పెడతాడు అనంతరం చందమామకు శాప విముక్తి కూడా కలిగిస్తారు. దీన్నిబట్టి తప్పు చేసిన వారిని క్షమించాలని కూడా వినాయకుడిని చూసి నేర్చుకోవాలి.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -