Tollywood Star Heroes: సినిమా కథలలో వేలు పెట్టే గుణం ఉన్న టాలీవుడ్ స్టార్స్ ఎవరో తెలుసా?

Tollywood Star Heroes: సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్లు హీరోలకు కథలు తెలపడం ఆ కథ హీరోలకు నచ్చితే వెంటనే ఒప్పుకోవడం సాధారణంగా జరుగుతూ ఉంటాయి. ఇక డైరెక్టర్లు చెప్పిన స్టోరీ హీరోలకు నచ్చకపోతే ఆ సినిమాను ఎంతో సున్నితంగా తిరస్కరిస్తారు. అంతేకాకుండా కథ మాత్రం హీరోలకు నచ్చితే ఆ సినిమా ఎంత కష్టమైనా నటించడానికి హీరోలు బాగా ఇంట్రెస్ట్ పెడతారు.

మరి కొంతమంది హీరోలు ఆ డైరెక్టర్లను బట్టి సినిమాలోని నటించడానికి ఒప్పుకుంటారు. ఇక డైరెక్టర్ ఒక స్టార్ హీరో దగ్గరకు కథను తీసుకుని వచ్చినపుడు హీరో సదరు డైరెక్టర్ ముందు సినిమా సక్సెస్ ను బట్టి ఆ సినిమా లో నటించడానికి ఒప్పుకుంటాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోలు కథల విషయంలో ఈ విధంగానే డైరెక్టర్లకు ఓకే చెబుతున్నారు. ఇలా మొత్తంగా డైరెక్టర్ల సక్సెస్ ను బట్టి హీరోలు సినిమాలో నటించడానికి ముందడుగు వేస్తున్నారు.

కానీ కొంతమంది స్టార్ హీరోలు తమ దగ్గరకు ఒక స్క్రిప్ట్ వచ్చినప్పుడు ఆ కథను పూర్తిగా వింటారు. విన్న తర్వాత ఆ కథలో కొన్ని సన్నివేశాలు నచ్చకపోతే తమకు తగ్గట్టుగా ఆ సినిమా స్టోరీ ను మార్చుకుంటారు. ఈ విధంగా టాలీవుడ్ లో చాలామంది స్టార్ హీరోలు కొన్ని సినిమా స్టోరీలను డైరెక్టర్లను ఒప్పించి మరీ ఆ కథలో చేర్పులు మార్పులు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో కొంతమంది స్టార్ హీరోలకు కథలో వేలు పెట్టే గుణం ఉందట.

ఇప్పుడు మనం ఆ స్టార్ హీరో ఎవరో తెలుసుకుందాం. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్, అల్లు అర్జున్, కిరణ్ అబ్బవరం లాంటి హీరోలు తమకు నచ్చిన కథ విషయంలో వేలు పెడతారట. ఆ సినిమాలో కొన్ని చేర్పులో మార్పులు తమకు తగ్గట్టుగా ఈ స్టార్ హీరోలు మార్చుకుంటారు. ఇక డైరెక్టర్లు కూడా వీరి మాట తీసేయకుండా వారి ఆలోచనలను కూడా గౌరవించి ఆ కథ హీరోకు నచ్చిన విధంగానే చేయాలని అంగీకరిస్తారట.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -