Prabhas-Ram Charan: రాముడి లుక్ లో ప్రభాస్ బెస్టా చరణ్ బెస్టా.. ఫ్యాన్స్ ఒపీనియన్ ఏంటంటే?

Prabhas-Ram Charan: సాధారణంగా సినీ ఇండస్ట్రీలో నటీనటులు చాలామంది ఉంటారు. కానీ వీరిలో పౌరాణిక పాత్రలు కొంతమందికే సెట్ అవుతాయని చెప్పవచ్చు. ఎందుకంటే దేవుడు వేషంలో మెప్పించాలంటే అది అందరి నటులకు కుదరని పని. అది కేవలం కొందరికే దక్కుతుంది. నటుడు సుమన్ అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వరి స్వామి పాత్రలో మరో స్థాయిలో కనిపించాడు.

అంతేకాకుండా అప్పుడు ప్రేక్షకులు కూడా నిజంగా వెంకటేశ్వర స్వామి ఇలానే ఉంటాడని అనుకునేవారు. ఆ తర్వాత శ్రీరామదాసు సినిమా లో సుమన్ రాముడిగా తన పాత్రను ఎంతో చక్కగా పండించాడు. అంతేకాకుండా అప్పటి టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ కృష్ణ.. అల్లూరి సీతారామరాజు పాత్రలో ప్రేక్షకులను మరో స్థాయిలో ఆకట్టుకున్నాడు. అప్పట్లో అగ్రస్టార్ హీరోగా వెలుగు వెలిగిన ఎన్టీఆర్ కూడా పౌరాణిక పాత్రలు చేసి తెలుగు నాట తనకంటూ చెరగని ముద్ర సంపాదించుకున్నాడు.

ఇదంతా పక్కన పెడితే తాజాగా రాముడు కి సంబంధించిన వేషం గురించి రెండు వర్గాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అదేమిటంటే ఆర్ ఆర్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ రాముడు వేషంలో మరో స్థాయిలో కనిపించాడు. నిజానికి చెప్పాలంటే ఆ రాముడు గెటప్ రామ్ చరణ్ కి ఒక గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక ప్రభాస్ త్వరలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న అది పురుష్ సినిమా లో రాముడు పాత్ర చేస్తున్నాడు.

కాగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను నిన్న అనగా సెప్టెంబర్ 30 న విడుదల చేశారు. ఈ పోస్టర్లో రెబల్ స్టార్ ప్రభాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా విల్లుని పైకి ఎక్కుబెట్టి రాముడు గెటప్ లో కనిపించాడు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్, ప్రభాస్ అభిమానుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. రాముడు గెటప్ లో ప్రభాస్ బెస్టా రామ్ చరణ్ బెస్టా అనే చర్చలు నడుస్తున్నాయి. అయితే బ్యాగ్రౌండ్ వల్ల చరణ్ లుక్స్ బాగున్నాయని ఎక్కువమంది చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -