Varsha Bumra: కూలి పని చేస్తూ ఐదేళ్ల బాబుతో గొప్ప స్థాయికి చేరుకున్న వర్షా!

Varsha Bumra: ప్రస్తుతం చాలామంది తమ సొంత టాలెంట్ తో ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నారు. ఇంకా చెప్పాలంటే జబర్దస్త్ బుల్లితెరపై ప్రస్తుతం హడావిడి చేసే కంటెస్టెంట్లు వాళ్లు కెరియర్ లో ఎన్నో బాధలు పడ్డారు. ఎంతలా అంటే కొన్ని కొన్ని సమయాలు తిండి తిప్పలు లేకుండా బ్రతికారు. ఎందుకంటే వాళ్లు తమ టాలెంట్ ను ఎక్కువగా నమ్ముకున్నారు.

మరి ఇదే నేపథ్యంలో తాజాగా ఒక మహిళ తన వ్యక్తిగత జీవితాన్ని తెలియజేసి ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె పేరు వర్షా బుమ్రా. తనకు పూట గడవడం కోసం కూలి పని చేస్తూనే తనకెంతో ఇష్టమైన డాన్స్ సొంతంగా నేర్చుకుంది. అంతేకాకుండా ఇటీవల ముంబైలో జరిగిన జీ డాన్స్ రియాల్టీ షోలో పాల్గొంది. డాన్స్ ఇండియా డాన్స్ సీజన్ 3 కి ఎంపిక అయింది. అంతేకాకుండా టైటిల్ విన్నర్ గా నిలిచింది వర్షా.

చాలామందితో కఠినమైన రౌండ్ లను ఫేస్ చేసింది. చివరికి విజయాన్ని సాధించింది. అంతేకాకుండా 5 లక్షల రూపాయల ప్రైజ్ మనీ కూడా సంపాదించింది. ఇక ఆ షో జడ్జ్ లను మెప్పించి స్పాన్సర్స్ నుంచి కొంత మొత్తం పది లక్షల రూపాయలను గెలుచుకుంది వర్షా. కూలి పని చేసుకొని వందల రూపాయలు సంపాదించుకునే వర్షకు ఈ ప్రైజ్ మనీ చాలా ఉపయోగపడుతుంది. అందరిలా కాకుండా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఆ షో లో విజయం సాధించిందట వర్షా.

హర్యానాకు చెందిన వర్షా బుమ్రా ది చాలా నిరుపేద కుటుంబం అట. తన తల్లిదండ్రులు ఆమెకు 15 ఏళ్లకే పెళ్లి చేశారని తెలిపింది. భవన నిర్మాణ రంగంలో తన భర్తతో కలిసి కూలి పనికి వెళ్లేదట. వీరిద్దరికి ఐదు సంవత్సరాలు బాబు కూడా ఉన్నాడు. తనకి డ్యాన్సులు మీద ఎంతో ఇంట్రెస్ట్ ఉండడంతో ఆ విషయం తన భర్తకు చెప్పిందట. దాంతో తన భర్త కూడా వర్షా కు ఎంతో సపోర్టివ్ గా నిలిచి ఆమెను ఈ స్థాయికి తీసుకుని వచ్చాడట.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -