Apple Ginger Tea: వారంలోనే బరువు తగ్గాలా.. ఈ టీ ట్రై చేయండి!

Apple Ginger Tea: సహజంగా మనలో ఎక్కువ మంది అధిక బరువుతో ఇబ్బంది పడుతుంటాం. సన్నగా, నాజూగ్గా ఉండాలని ఎక్కువ మంది కోరుకుంటుంటారు. బరువు పెరిగితే ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది. కానీ, సరైన డైట్ మెయిన్ టైన్ చేయడం అంటే మాటలు కాదు. నిత్య జీవితంలో మన పనుల్లో బిజీ కావడం వల్ల వేళకు తిండి తినడం చాలామందికి కష్టతరంగా ఉంటుంది. కానీ, సన్నగా అవ్వాలని మాత్రం కోరిక ఉంటుంది. దీని కోసం రకరకాల పద్ధతులు అనుసరిస్తుంటాం. ఇప్పుడు చెప్పబోయే టెక్నిక్ కనుక ఫాలో అయ్యారంటే వారంలో మీ బరువు తగ్గడం ఖాయం. అదేంటో తెలుసుకోండి.

అధిక బరువును తగ్గించుకోవాలంటే యాపిల్ అల్లం టీ బెస్ట్ అంటున్నారు డైట్ నిపుణులు. అది ఎలా చేయాలో ఓ లుక్కేద్దాం రండి. యాపిల్ చాలా మందికి ఇష్టమైన పండు. ఇందులో కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. బరువు పెరగకుండా చేస్తుంది. ఆకలిని తగ్గిస్తుంది. కానీ రోజూ యాపిల్ తినాలంటే కష్టమే. అయితే, వారంలో కొన్నిసార్లయినా యాపిల్ తినాలి. యాపిల్ పండులో జీర్ణక్రియను మెరుగుపరిచే శక్తి ఉంది. మన దేహంలోని వ్యర్థాలు, హానికారక పదార్థాలను బయటకు పంపేందుకు దోహదం చేస్తుంది. యాపిల్ తో అల్లం కలిపి టీ చేసి తాగితే హెల్త్ కు చాలా మంచిది.

అల్లంలోని యాంటీ ఆక్సిడెంట్స్, షోగాల్స్, జింజెరాల్స్ వంటివి కొవ్వును త్వరగా కరిగిస్తాయి. మనం తిన్న ఆహారంలో త్వరగా అరిగిపోని పదార్థాలుంటే వాటిని ఇట్టే అరిగించేస్తాయి. డయాబెటిస్ ఉన్న వారికి అల్లం చాలా మేలు చేస్తుంది. యాపిల్ అల్లం టీ ఎలా చేయాలంటే…

యాపిల్ పండు తొక్క తీసి చిన్న ముక్కలుగా వేరు చేయండి. అంగుళం అల్లం ముక్క తీసుకొని మిక్సీలో మెత్తగా ఆడించండి. మూడు కప్పుల నీరు తీసుకొని యాపిల్ ముక్కలు, అల్లం ముద్ద వేసి ఓ 10 నిమిషాలు లో ఫ్లేమ్ లో మరిగించండి. యాపిల్ ముక్కలు, అల్లం పూర్తిగా నీటిలో మునిగేలా చూసుకోండి. ఇక స్టౌ ఆపేసి ఆ నీరు చల్లబడ్డాక మిక్సీలో వేసి జ్యూస్ లా తయారు చేసుకోండి. ఇక యాపిల్ అల్లం టీ రెడీ. ఉదయాన్నే కాస్త వేడి చేసుకొని తాగండి. ఇక ఫలితాలు మీరే చూడండి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -