Delhi: ఢిల్లీలో చిన్నారిపై స్కూల్ లోనే అత్యాచారం..!!

Delhi: నిర్భయ ఘటన జరిగిన తర్వాత కఠిన చట్టాలు తెచ్చామని ప్రభుత్వాలు చెబుతున్నాయి. కాని మహిళలపై వేదింపులు, క్రూరత్వం ఎక్కడా ఆగడం లేదు. దేశంలో ప్రతి రోజు మహిళలు, బాలికపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఢిల్లీలో దారుణ ఘటన వెలుగు చూసింది. కేంద్రీయ విద్యాలయంలో 11 ఏళ్ల విద్యార్థినిపై ఇద్దరు సీనియర్లు మరుగుదొడ్డిలో రేప్ కు పాల్పడ్డారు. ఈ సంఘటన జూలై నెలలో జరుగగా స్కూల్ సిబ్బంది బయటకు చెప్పలేదు. ఇటీవల బాలిక తల్లిదండ్రులు మహిళా కమిషన్ తో చెప్పడం తో విషయం వెలుగు చూసింది.

పోలీసులు,బాలిక తల్లిదండ్రులు తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. జులై నెలలో స్కూల్ జరుగుతున్నప్పుడు బాలిక తన తరగతి గదికి వెళుతుండగా 11,12వ తరగతి చదువుతున్న ఇద్దరు అబ్బాయిలకు పొరపాటున తగిలింది. దానికి ఆమె అప్పుడే వారికి క్షమాపణలు కూడా చెప్పింది. అయితే.. వారు బాలికను కోపంతో తిడుతూ బాత్రూమ్ లోకి తీసుకెళ్లారు. తర్వాత తలుపులు మూసి తనపై అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక చెప్పింది.

ఈ ఘటన జరిగిన వెంటనే తాను వెళ్లి టీచర్‌కు చెప్పింది. తర్వాత రోజు ఇద్దరు విద్యార్థులను బహిష్కరించినట్లు చెప్పారని, ఎక్కడా ఈ విషయం గురించి మాట్లాడవద్దని టీచర్ చెప్పినట్లు తెలిపింది. ఇటీవల బాలికల తల్లిదండ్రులు మహిళా కమిషన్ ను కలిసి జరిగింది మొత్తం చెప్పడం జరిగింది. ఈ కేసును సుమోటోగా తీసుకున్న ఢిల్లీ మహిళా కమిషన్.. పోలీసులకు, స్కూల్ ప్రిన్సిపాల్‌కు నోటీసులు జారీ చేసింది. ఎఫ్ఐఆర్ కాపీని, ఈ కేసులో అరెస్ట్ చేసిన వారి వివరాలను అందించాలని ఆదేశించింది.

ఘటన గురించి పోలీసులకు చెప్పకుండా దాచిన టీచర్‌, ఇతర సిబ్బందిపై తీసుకున్న చర్యల గురించి సమాచారం అందించాలని పాఠశాల అధికారులను, పోలీసులను ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ స్వాతి మలివాల్ కోరింది. ఈ విషయంలో తొందరగా విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే ఇంత జరిగినా బయటకు రానీయని పాఠశాల యాజమాన్యం పై కూడా విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేశారు.

Related Articles

ట్రేండింగ్

Volunteers on YSRCP Manifesto: గ్రామ వాలంటీర్ల మైండ్ బ్లాంక్ చేసిన మేనిఫెస్టో.. నిన్ను నమ్మం జగన్ అంటూ?

Volunteers on YSRCP Manifesto: వైసీపీ ప్రకటించిన మేనిఫెస్టోని చూసి సాధారణ ప్రజలే కాదు ఆయన కోసమే పని చేసిన గ్రామ వాలంటీర్లు కూడా జగన్ అన్యాయం చేశాడని గగ్గోలు పెడుతున్నారు సదరు గ్రామ వాలంటీర్లు. గత...
- Advertisement -
- Advertisement -