Heroine Sangeetha: హీరోయిన్ సంగీత భర్త టాప్ సింగర్ అని మీకు తెలుసా ?

Heroine Sangeetha: ఒక్క చాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ అన్న డైలాగ్ ఇప్పటికీ మనకు గుర్తు ఉండే ఉంటుంది. ఖడ్గం చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో ఆ చిత్రం లో ఉన్న ఈ డైలాగ్ కూడా అంతే పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇలా మనం ఆ డైలాగ్ ని వినగానే మనకు గుర్తు వచ్చే హీరోయిన్ సంగీత. అచ్చమైన తెలుగింటి ఆడపిల్లలా ఉండే సంగీత మాత్రం తెలుగమ్మాయి కాదనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. నిజానికి ఈమె తమిళ అమ్మాయి.

అయినా కానీ తెలుగులో చాలా సినిమాలలో హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. హీరోయిన్ సంగీత ఒక తెలుగులోనే తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో కలిపి 65 కి పైగా చిత్రాల్లో నటించింది. అయితే కొన్ని రోజులు విరామం తీసుకుని మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించింది.

సరిలేరు నీకెవ్వరులో రష్మిక తల్లిగా నటించి మెప్పించింది. ఇక ఆ తర్వాత ఆచార్య, F3 చిత్రాల్లో కూడా నటించింది. ఇంకా బుల్లి తెరపై కూడా పలు షోలకి జడ్జ్ గా వ్యవహరిస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. మొత్తంమీద తన సెకండ్ ఇన్నింగ్స్ ని కూడా వివిధ పాత్రలు పోషిస్తూ మళ్ళీ టాలీవుడ్ లో బిజీ అయిపోయింది.

అయితే తన పెళ్లి మరియు పిల్లల గురించి మాత్రం ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. అయితే తను తమిళంలో ప్రముఖ సింగర్ అయిన క్రిష్ ని 2009 లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు వాళ్ళకి ఒక పాప కూడా ఉంది. తమిళం లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ని పాడాడు క్రిష్. ధనుష్ నటించిన సినిమాలో రౌడీ బేబీ సాంగ్ గుర్తుంది కదా. ఆ పాట పాడింది కూడా క్రిష్ యే. ఇక ఇప్పుడు ఒకరు టాలీవుడ్ లో మరియు కోలీవుడ్ లో బిజీ గా గడుపుతూ ఒక వైపు దాంపత్య జీవితాన్ని మరో వైపు కెరీర్ ని చూసుకుంటూ ముందుకెళుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: జగన్ ను ముంచిన సలహాదారుడు అతనేనా.. వృద్ధాప్య పెన్షన్ విషయంలో ముంచింది ఎవరంటే?

CM Jagan: 2014 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేసరికి రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్ కేవలం 200 రూపాయలు మాత్రమే ఉండేది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే రూ. వెయ్యి చేశారు. మళ్లీ...
- Advertisement -
- Advertisement -